Gossip Garage : అదో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. అందులో ఓ ప్రముఖ నటుడి రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీని.. ఫ్యూచర్ ప్లాన్స్‌ను చూపిస్తున్నారట. అందులో బాబాయ్ రోల్‌ను అబ్బాయ్ పోషిస్తున్నాడట. ఇదంతా త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్ గురించి వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ గాసిప్. ఇంతకీ అసలు మ్యాటరేంటో చూద్దాం.
ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..
భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గేమ్‌ఛేంజర్ మూవీ. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో..దిల్‌రాజు నిర్మాణంలో..రామ్‌చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై..ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయ్యాలనుకుంటున్నారో..అవే ఈ సినిమాలో హైలెట్ సీన్స్‌గా ఉండబోతున్నాయట.
బాబాయ్ రియల్ లైఫ్ రోల్‌నే అబ్బాయ్ వెండి తెరమీద చూపించారా?
ట్రైలర్‌లో కనిపించిన చాలా సీన్స్ గతంలో పవన్ చేసిన పొలిటికల్ కామెంట్స్‌కు సింక్ అయ్యేలా ఉన్నాయంటున్నారు. పవన్ పొలిటికల్ జర్నీని.. విక్టరీని.. ఫ్యూచర్ ప్లాన్‌ను..గేమ్‌ఛేంజర్‌లో చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. బాబాయ్ రియల్ లైఫ్ రోల్‌నే అబ్బాయ్ వెండి తెరమీద చూపించబోతున్నారన్న న్యూస్ అయితే ఆసక్తికరంగా మారింది. ఓవైపు రామ్‌చరణ్ ఫ్యాన్స్..ఇంకోవైపు పవన్ ఫ్యాన్స్..ఈ న్యూస్‌పై తెగ ఖుషీ అవుతున్నారు.
ఇక రాజమండ్రిలో జరిగే గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు. గేమ్‌ఛేంజర్ సినిమా పొలిటికల్ బ్రాక్ డ్రాప్ మూవీ అవ్వటం..పవన్ డైలాగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మూవీపై, ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఇంకా ఆసక్తి రేపుతోంది. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజీ మీద రియల్ పొటిటీషియన్‌తో..రీల్ పొలిటీషియన్ కనిపిస్తే పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : సైకిల్ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతుందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు స్కెచ్ ఏంటి?