Gossip Garage Megastar Chiranjeevi 158 Movie Aishwarya Rai female lead
Chiranjeevi : బాస్ స్టెప్పేస్తే ఆ గ్రేసే వేరు. ఆయన డైలాగ్ చెప్తే బాక్సాఫీస్ బద్దలే. ఏడు పదుల వయసులోనే యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. లేటెస్ట్‌గా సంక్రాంతి రేసులో మన శంకర వర ప్రసాద్ హిట్ తెచ్చుకోవడంతో మెగాస్టార్స్ ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదే టైమ్‌లో చిరు కాంపౌండ్ నుంచి మరో లీక్ బయటికి వచ్చింది.
చిరంజీవి తన 158వ సినిమాను డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయింది. అయితే చిరంజీవి సరసన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందట.
అదే నిజమైతే మెగాస్టార్‌తో ఐశ్వర్యరాయ్ మొదటిసారి జతకట్టనుండటం ఫ్యాన్స్‌కి భారీ ట్రీట్‌గా మారనుంది. ఫుల్ లెన్త్ రోల్‌తో చిరు ఫ్యాన్స్‌ను ఐశ్యర్వ మెస్మరైజ్ చేయడం పక్కా అంటూ సినీ వర్గాల్లో హాట్ టాక్ నడుస్తోంది.
చిరు, బాబీ మూవీలో మరో సర్‌ప్రైజ్ ఉందట. ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తారని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ చేసి, మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. మెగాస్టార్ మూవీలో ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేయబోతోందా లేదా జస్ట్ రూమర్సేనా అన్నది డైరెక్టర్ బాబీనే క్లారిటీ ఇవ్వాలి.