Bhartha Mahasayulaku Wignyapthi : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ.. ఇరువురి భామల మధ్య నలిగిన రవితేజ..
రవితేజ ఫ్లాప్స్ చూస్తుండటం, ఈ సినిమా కామెడీ సినిమా అని ప్రమోట్ చేయడం, పండక్కి రావడంతో కాస్త అంచనాలు నెలకొన్నాయి. (Bhartha Mahasayulaku Wignyapthi)
Bhartha Mahasayulaku Wignyapthi Review
Bhartha Mahasayulaku Wignyapthi : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సత్య, వెన్నెల కిషోర్, మురళీధర్, సునీల్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నేడు జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(Bhartha Mahasayulaku Wignyapthi)
కథ విషయానికొస్తే..
రామ సత్యనారాయణ అలియాస్ రామ్ అలియాస్ సత్య(రవితేజ) ఒక ఆల్కహాల్ కంపెనీ ఓనర్. అనార్కలి అనే ఒక కొత్త వైన్ ని తయారు చేస్తాడు. ఆ వైన్ ని ఇంటర్నేషనల్ ప్రమోట్ చేద్దామని స్పెయిన్ లో ఒక కంపెనీతో కలుద్దాం అనుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేసారు కనుక్కుందాం అని రామ్, అతని PA లీలా(వెన్నెల కిషోర్) స్పెయిన్ కి వెళ్తాడు. అక్కడ ఆల్కహాల్ కంపెనీ MD మానస(ఆషిక రంగనాథ్)ని కలుస్తాడు. తన ఆల్కహాల్ రిజెక్ట్ చేసింది మానస PA బెల్లం(సత్య) అని తెలిసి అతని మోసాన్ని బయటపెట్టి మానసకి దగ్గరవుతాడు రామ్. ఈ క్రమంలో మానసకు ఫిజికల్ గా దగ్గరవుతాడు.
తనకు పెళ్లి అయిందనే విషయాన్ని మానసకు చెప్పకుండా వచ్చేస్తాడు. స్పెయిన్ నుంచి వచ్చాక తన భార్య బాలామణి(డింపుల్ హయతి)కి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందని కంగారుపడతాడు రామ్. అనుకోకుండా మానస హైదరాబాద్ కి వచ్చి రామ్ ని కలుస్తుంది. దీంతో రామ్ ఇటు భార్యని, అటు మానసని ఒకరికొకరు తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. మరి రామ్ చేసిన తప్పు భార్య బాలామణికి తెలుస్తుందా? మానస రామ్ కి పెళ్లి అయిందని తెలిసి ఏం చేస్తుంది? ఇద్దరి మధ్యలో రామ్ ఎలా నలిగిపోయాడు? మానస – బాలామణి ఎలా కలుస్తారు? ఇద్దరికీ నిజం తెలిసాక ఏం జరిగింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
గత కొంతకాలంగా రవితేజ ఫ్లాప్స్ చూస్తుండటం, ఈ సినిమా కామెడీ సినిమా అని ప్రమోట్ చేయడం, పండక్కి రావడంతో కాస్త అంచనాలు నెలకొన్నాయి. భార్య, ప్రియురాలు మధ్యలో నలిగిపోయే హీరో అనే కథతో గతంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కథ.
ఫస్ట్ హాఫ్ రామ్ బిజినెస్ పని మీద వెళ్లి మానసకు దగ్గర అయి వచ్చేయడం మానస హైదరాబాద్ కి వచ్చాక ఇద్దరి మధ్య దొరక్కుండా మేనేజ్ చేయడంతో సాగుతుంది. మానసకు నిజం తెలిసాక ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ పై కాస్త ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇద్దరికి తెలియకుండా రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్ కలిసి చేసే ప్రయత్నాలు దాంతో వచ్చే కామెడీతోనే సీన్స్ సీన్స్ గా సాగుతుంది. చివరి తెలిసాక ఏం జరుగుతుంది అనేది క్లైమాక్స్ కొత్తగా రాసుకున్నారు.
మొదటి అరగంట సింపుల్ గా సాగిపోతుంది. మధ్యలో సత్య అక్కడక్కడా నవ్విస్తాడు. ఇక మానస హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి అసలు కథ మొదలయి రవితేజ ఇబ్బందిపడుతుంటే పక్కన వెన్నెల కిషోర్, సునీల్ సపోర్ట్ తో బాగానే నవ్వించారు. అయితే సెకండ్ హాఫ్ ని కాస్త సాగదీశారు. కథనం ఏమి లేకపోవడంతో అక్కర్లేని సీరియల్ సాంగ్స్ కి డ్యాన్స్, సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ అంటూ పెట్టి సాగదీశారు. రోహన్ కామెడీ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు.
క్లైమాక్స్ హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య రొటీన్ డైలాగ్స్ తో నడిపించినా కొత్తగానే ఎండ్ చేసారు. రవితేజ గత సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్ అనుకోవచ్చు. నవ్వుకోడానికి అయితే వెళ్లొచ్చు. కొన్ని కామెడీ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రమోషన్స్ లో వాడిన సత్య సాంగ్ ని ఎడిటింగ్ లో కట్ చేసేసారు. ఫైట్ సీన్స్ అక్కర్లేకపోయినా ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
రవితేజ కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ కామెడీ ట్రై చేసి బాగానే పండించాడు. ఇద్దరి భామల మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ చాలా బాగా నటించాడు. కానీ గత కొన్ని సినిమాల నుంచి రవితేజ లుక్స్ మీద వచ్చే కంప్లైంట్ ఈ సినిమాలో కూడా అది మారలేదు. నా సామిరంగ సినిమాలో నటనతో అదరగొట్టిన ఆషికా రంగనాథ్ ఇందులో అయితే అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఇచ్చి నటన పర్వాలేదనిపించింది.
ఇక డింపుల్ హయతి నటించాలా వద్దా అని కష్టపడి యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, సునీల్, మురళీధర్.. బాగానే నవ్విస్తారు. సోనియా సింగ్, తారక్ పొన్నప్ప.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also See : Nupur Sanon : సింగర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. లిప్ కిస్ ఇస్తూ.. ఫొటోలు వైరల్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయింది. సాంగ్స్ యావరేజ్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తీసేస్తే బెటర్. రొటీన్ పాయింట్ తీసుకొని కేవలం నవ్వించాలి అని రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. లొకేషన్స్ పరంగా స్పెయిన్ లో చాలా మంచి లొకేషన్స్ లో చిత్రీకరించారు.
మొత్తంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పండక్కి ప్రేక్షకులను నవ్వించడానికి ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరోతో చేసిన ప్రయత్నం. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
