Tollywood : రెమ్యునరేషన్ కోట్లలో.. కలెక్షన్స్ లక్షల్లో..

టాలీవుడ్ లో వారానికి డజన్ పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

Gossip Garage new trend in tollywood

స్టార్ హీరోలకు కోట్ల రెమ్యునరేషన్లు. కానీ పుల్లింగ్ మాత్రం జీరోనా? ఒక హీరో పది కోట్లు. మరో హీరో 8 కోట్లు..కానీ చాలా మంది హీరోలకు వరుస ఫ్లాపులు. అయినా రెమ్యూనిరేషన్ మాత్రం తగ్గదు. సినిమాలు తీయడం ఆగదు. ఎటొచ్చి నిర్మాత మాత్రం లాస్ అవుతున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఏడాది తరువాత మిడ్ రేంజ్ సినిమాలు మెలమెల్లగా మాయం అయిపోయే ప్రమాదం ఉందా? మరి దీనికి సినీ హీరోలు చెక్ పెట్టబోతున్నారా? ఎవరూ లాస్ కాకుండా అందరికి డబ్బులొచ్చే చిట్కా ఏదైనా ఉందా?

టాలీవుడ్ లో వారానికి డజన్ పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉంటాయి. అయితే కంటెంట్ బాగుంటే సినిమా హిట్.. లేదంటే ప్లాప్.. ఆ తరువాత షో నుండి థియేటర్లు ఖాళీగా ఉండాల్సిందే. ఇది ప్రతి వారం జరిగేదే. టాలీవుడ్ లో నెలకు ఒక్క సినిమా హిట్ అయితే మిగతా సినిమాలు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ఇందులో పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి.

Anupama Parameswaran-Dhruv vikram : స్టార్‌ హీరో కొడుకుతో అనుపమ ప్రేమాయ‌ణం..! ప్రైవేట్ ఫోటో లీక్‌..!

దీంతో నిర్మాతలు ఒకేసారి ఢమాల్ మని కిండపడిపోతున్నారంట. దీంతో మళ్లీ నిర్మాతలు సినిమాలకు నిర్మించాలంటే చాలా కష్ట పడాల్సి వస్తోందన్న టాక్ విన్పిస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోలు టైర్1 హీరోలు, టైర్2 హీరోల సినిమాలు కోట్ల బడ్జెట్ తో తీసినా..కనీసం లక్షల్లో కూడ రావటంలేదని నిర్మాతలకు వాపోతున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు హీరోలు షేరింగ్ పద్దతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ఈ కొత్త పద్దతిలో హీరోకి రూపాయి కూడా ఇవ్వకండా సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే వసూళ్ళ లాభాల్లో నిర్మాత, హీరోలు షేరింగ్ చేసుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారని టాక్. ఈ చిట్కాతో హీరోలకు వరుస సినిమాలు వస్తుంటాయి..అలాగే నిర్మాతలకు ఆర్ధిక భారం కూడా తగ్గే అవకాశం ఉందట.

Manchu lakshmi : మంచు లక్ష్మి ఎమోష‌న‌ల్‌.. త‌మ్ముడు మంచు మ‌నోజ్‌ను ప‌ట్టుకుని క‌న్నీళ్లు.. వీడియో వైరల్‌

కేవలం హీరోలు మాత్రమే కాదు, మిగతా టెక్నిషియన్స్ కూడా ఇలానే షేరింగ్ సిస్టమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంటా. ఇప్పుడు రాజమౌళి..మహేశ్ సినిమా ఇలానే జరుగుతుందని టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది. నితిన్, శర్వానంద్, గోపిచంద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా షేరింగ్ పద్దతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఈ షేరింగ్ సిస్టమ్ ఎంత వరకు ఫలిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.