Manchu lakshmi : మంచు లక్ష్మి ఎమోషనల్.. తమ్ముడు మంచు మనోజ్‌ను పట్టుకుని కన్నీళ్లు.. వీడియో వైరల్
తమ్ముడు మంచు మనోజ్‌ను చూసి మంచు లక్ష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.

Manchulakshmi getting emotional With manchumanoj Video viral
గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్లుగా ఈ గొడవలు సాగుతున్నాయి. సోదరుడు విష్ణు తన కార్లను దొంగిలించాడంటూ మోహన్ బాబు ఇంటి ముందు ఇటీవల మంచు మనోజ్ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
కూతురి పుట్టిన రోజు వేడక కోసం రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని ఆరోపించారు. మనోజ్ చేసిన ఈ ఆరోపణలపై మంచు విష్ణు, మోహన్‌బాబు ఇంత వరకు స్పందించలేదు.
కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి..
ఈ వివాదాలపై మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. తాజాగా ఆమె ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది.
View this post on Instagram
Upasana: వేలాది కోట్ల సంపద.. అయినా రిచ్ లైఫ్‌స్టైల్, లగ్జరీకి అతుక్కుపోకుండా ఉపాసన ఇలా..
కాగా.. ఆమె స్టేజీపై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు అక్కడికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ్ముడు మనోజ్‌ను చూసి లక్ష్మి ఎమోషనల్ అయింది. స్టేజీపై ఉన్నాననే సంగతి మరిచిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. తమ్ముడిని పట్టుకుని మనసారా ఏడ్చేసింది. మనోజ్ దంపతులు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.