Vishwambhara : చిరు ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న ‘రామ.. రామ..’ సాంగ్
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.

Chiranjeevi Vishwambhara Movie Rama Raama First Single out now
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘రామ రామ’ అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు శోభి మాస్టర్-లలిత మాస్టర్స్ కొరియోగ్రఫీ అందించారు. హనుమంతుడి మహిమాన్వితత్వం, రామునిపై భక్తి, ఆధ్యాత్మికత గురించి వివరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో త్రిషతో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మొత్తం ఐదుగురు కథానాయికలుగా నటిస్తున్నారు.