Rajamouli – Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు? ఇంకా ఎన్ని రోజులు ఆగాలంటే..?
రాజమౌళి - మహేష్ సినిమా పై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి.

Rajamouli Mahesh Babu Movie Release Date Rumors goes Viral
Rajamouli – Mahesh Babu : RRR తర్వాత రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో జంగిల్ యాక్షన్ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటిగ్ కూడా పూర్తిచేసింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి హైదరాబాద్ లో సెట్ వర్క్ జరుగుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళాడు. ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
Also Read : Pawan Kalyan : రెడీగా ఉండండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం.. ఈసారి ఫిక్స్..
మహేష్ బాబు – రాజమౌళి సినిమా 2027 మార్చ్ 25న రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే సరిగ్గా RRR సినిమా రిలీజయిన ఐదేళ్లకు మళ్ళీ మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ కాబోతుంది. RRR సినిమా 2022 మార్చ్ 25న రిలీజ్ అయింది. రాజమౌళి ఈ సంవత్సరంలో షూటింగ్ పూర్తి చేసేసి 2026 లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి 2027లో ప్రమోషన్స్ మొదలుపెట్టి మార్చ్ లో రిలీజ్ చేస్తారట. ఒకవేళ ముందే సినిమా రెడీ అయినా 2027 లోనే రిలీజ్ చేస్తారట.
తాజాగా ఆస్కార్ సంస్థ ది అకాడమీ 2027 రిలీజయిన సినిమాల నుంచి యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీంతో మహేష్ బాబుతో చేసే సినిమాని రాజమౌళి 2027 లోనే రిలీజ్ చేసి మరోసారి ఆస్కార్ ని సాధించాలని అనుకుంటున్నాడు. RRR సినిమాతో హాలీవుడ్ లెవల్లో గుర్తింపు వచ్చింది కాబట్టి అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ అదే డేట్ కి రిలీజ్ చేస్తారట. సో మహేష్ ఫ్యాన్స్ 2027 మార్చ్ వరకు ఆగాల్సిందే బాబుని వెండితెరపై చూడటానికి.
Also Read : Shanthi Priya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లి.. భర్త చనిపోయాక.. ఇలా గుండు కొట్టించుకొని..