Pawan Kalyan : రెడీగా ఉండండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం.. ఈసారి ఫిక్స్..

హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

Pawan Kalyan : రెడీగా ఉండండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం.. ఈసారి ఫిక్స్..

Movie Unit Gives Clarity on Pawan Kalyan HariHara VeeraMallu Release Date

Updated On : April 11, 2025 / 4:27 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చేరడంతో పవన్ అక్కడే ఉన్నారు. పవన్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క సినిమాలు చేస్తా అంటున్నా బిజీ వల్ల డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. పవన్ నుంచి హరిహర వీరమల్లు, OG సినిమాలు మాత్రం పక్కా వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే ఇటీవల మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇంకా ఓ నాలుగు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈసారి కూడా సినిమా చెప్పిన టైంకి వస్తుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ ట్రైలర్ చూశారా?

తాజాగా నిర్మాణ సంస్థ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ రీ రికార్డింగ్, డబ్బింగ్, VFX పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్ ని గ్రాండియర్ గా రూపొందిస్తున్నాం. లైట్ స్పీడ్ లో పనులు జరుగుతున్నాయి. వెండితెరపై అంతకుముందెప్పుడు చూడని అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు ఈ సమ్మర్ లో అందించబోతున్నాం. ‘హరి హర వీరమల్లు’ సినిమా మే 9న రిలీజ్ కానుంది అని తెలిపారు. ఓ పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఇంతకుముందెప్పుడు చూడని సినిమా అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి అంటూ పోస్ట్ చేసారు.

దీంతో హరిహర వీరమల్లు సినిమా మే 9 న పక్కాగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మొఘల్ కాలం నాటి కథతో భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్, నర్గీస్‌ ఫక్రీ, నోరా ఫతేహి.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Shanthi Priya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లి.. భర్త చనిపోయాక.. ఇలా గుండు కొట్టించుకొని..