Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ ట్రైలర్ చూశారా?
మీరు కూడా సోదరా ట్రైలర్ చూసేయండి..

Sampoornesh Babu Sanjosh Sodara Movie Trailer Released
Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సోదరా’ సినిమాతో రాబోతున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సోదరా. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎస్‌లు గెస్ట్ లుగా వచ్చారు.
Also Read : Shanthi Priya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ చెల్లి.. భర్త చనిపోయాక.. ఇలా గుండు కొట్టించుకొని..
సోదరా ట్రైలర్ చూస్తుంటే ఎంతో ప్రేమగా పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు వారి పెళ్లి కోసం పడే కష్టాలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా సోదరా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. నాకు సంపూ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమాను నేను థియేటర్‌లో ఒక షో బుక్ చేసుకోని మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను అని అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఎస్‌కేఎన్ స్పీచ్ విన్న తరువాత ఎమోషన్ అయ్యాను. ఈ సినిమాను ఎంకరైజ్ చేయడానికి తను ఓ షోను ఏర్పాటు చేస్తానని చెప్పడం గొప్ప విషయం. నాకు సంపూకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. హృదయకాలేయం సూపర్‌హిట్ తరువాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు. నాకు ఓ కారు, ఇల్లు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కట్టి ఇప్పించాడు. నాకు సంపూ ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. సంపూను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు.
బాబు మోహన్ మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు ఎన్ని పాత్రలు చేసినా అన్ని కామెడీ పాత్రలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. సోదరా సినిమాలో నా పాత్ర ఏడిపిస్తుంది అని తెలిపారు. సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ ఈ వేడుకకు రావడం హ్యపీగా ఉంది. అప్‌డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వఛ్చమైన కథ సోదరా. ఇది నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర అని అన్నారు.