SSMB29 : స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రాజ‌మౌళి..! SSMB29 గ్లింప్స్ ఆరోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా SSMB29పై ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి

SSMB 29 movie glimse news viral

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా SSMB29పై ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. ఈ మధ్య రాజమౌళి చాలా రిలాక్స్‌గా కనిపిస్తుండటంతో సినిమా షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది. షూట్ ఎక్కడ చేస్తున్నారని ఆరా తీస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, రాజమౌళి కీలక సీన్స్‌ను మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతుండటంతో, ప్రతి దృశ్యాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు జక్కన్న సమయం తీసుకుంటున్నారని టాక్.

Movie Ticket Rate : ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. సినిమా టికెట్ ధ‌ర రూ.200 దాటొద్దు..

మహేష్ బాబు కూడా తన ఫిట్‌నెస్‌తో పాటు న్యూలుక్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఓ కీలక డ్యాన్స్ సీక్వెన్స్ కోసం మహేష్ రిహార్సల్స్‌లో మునిగిపోయారని అంటున్నారు. ఈ డ్యాన్స్ సన్నివేశం అభిమానులను అలరించేలా ఉంటుందని, మహేష్ గత సినిమాల్లాగా రాజమౌళి-మహేష్ సినిమా కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌తోనే ఆగిపోకుండా, హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని, హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో అడవుల్లో ఎక్కువగా షూటింగ్ జరుగుతుందని, ఇప్పటికే కెన్యాలో షెడ్యూల్ ప్లాన్ చేసినా, శాంతిభద్రతల సమస్యల కారణంగా ఆ షెడ్యూల్ రద్దయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మహేష్ బర్త్‌ డే సందర్భంగా ఆగస్టు 9న SSMB29 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ కానుందని న్యూస్ వైరల్ అవుతోంది.