PEDDI : షాక్‌లో ఫ్యాన్స్ .. రామ్‌చ‌ర‌ణ్‌ను వెంటాడుతున్న ఆ మ్యూజిక్‌..!

ఓ విషయం మాత్రం మెగా రామ్‌చరణ్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట.

Gossip Garage That music that haunts Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా విడుదలైన పెద్ది సినిమా గ్లింప్స్ 24 గంటల్లోనే 30 మిలియన్లకుపైగా వ్యూస్ ను సొంతం చేసుకొని టాప్ ప్లేస్ లో నిలిచింది. పెద్ది గ్లింప్స్ 21 గంటల్లోనే 30.8 మిలియన్ల వ్యూస్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇప్పటివరకు టాప్ లో ఉన్న దేవర, పుష్ప-2 రికార్డులను దాటేసింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఓ విషయం మాత్రం మెగా రామ్‌చరణ్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట. పెద్ది సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అచ్చం పుష్ప-2 లుక్లా ఉందనే కామెంట్స్ వినిపించాయట. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్.. చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కాస్త చర్చ కూడా జరిగిందట. అయితే శ్రీరామ నవమి సంధర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ పై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కర్షన్స్ జరుగుతుంది.

ఈసారి మ్యూజిక్ పై..పెద్ది గ్లింప్స్ RRలో ఎక్కువ శాతం గేమ్ ఛేంజర్ RRలా వినిపించటంతో రెహమాన్ మ్యూజిక్ పై సోషల్ మీడియాలో జోరుగానే చర్చ జరుగుతుందట. గేమ్ ఛేంజర్కు థమన్ ఇచ్చిన RRను పోలి ఉండటంతో ఎవరు ఎవరి మ్యూజిక్ నుండి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాల్లో కూడా చరణ్నే నటించటంతో మళ్ళీ గేమ్ ఛేంజర్ RR ఎందుకు అంటున్నారు. ఇప్పుడు రెహమాన్ మ్యూజిక్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే సైలెంట్ గా థమన్ ఇచ్చాడా? రెహమానే ఇచ్చాడా అంటున్నారు ఫ్యాన్స్.

Sivaji : ‘కోర్ట్’ అయిపోయింది.. నెక్స్ట్ ‘దండోరా’ అంటున్న శివాజీ..

పెద్ది గ్లింప్స్ కు తెలుగులో మంచి వ్యూస్ వచ్చి సరికొత్త రికార్డులను తిరగరాసినా మిగిలిన భాషల్లో మాత్రం అంతగా వ్యూస్ సాధించలేకపోయింది. హిందీ,తమిళ్, కన్నడ, మలయాలంలో మాత్రం ఆశించిన వ్యూస్ గ్లింప్స్ కు రాకపోవటంతో, మిగిలిన భాషల్లో ఇంకా ఏదో మిస్ అవుతున్నామనే ఫిలింగ్ చరణ్ ఫ్యాన్స్ ను వెంటాడుతోందట.