Sivaji : ‘కోర్ట్’ అయిపోయింది.. నెక్స్ట్ ‘దండోరా’ అంటున్న శివాజీ..
కోర్ట్ సినిమా భారీ హిట్ కొట్టాక ఇప్పుడు శివాజీ మరో సినిమా షూటింగ్ లో భాగమయ్యాడు.

After Court Movie Sivaji will be part in Dandora Movie
Sivaji : ఒకప్పటి హీరో శివాజీ కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల కోర్ట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో శివాజీ నటనకి అంతా ఆశ్చర్యపోయి అభినందించిన సంగతి తెలిసిందే. కోర్ట్ సినిమా భారీ హిట్ కొట్టాక ఇప్పుడు శివాజీ మరో సినిమా షూటింగ్ లో భాగమయ్యాడు.
కలర్ ఫోటో, బెదురులంక 2012 లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దండోరా’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దండోరా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టింది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో శివాజీ పాల్గొంటున్నారు. కోర్ట్ లాంటి హిట్ సినిమా తర్వాత శివాజీ దండోరాలో భాగమయ్యాడు.
Also Read : నటి హేమ ఇందుకే నాకు నోటీసులు పంపింది.. నేను ఇక ఎక్కడా తగ్గేదే లేదు: కరాటే కల్యాణి
కులాల వ్యత్యాసం, కులాంతర వివాహం కాన్సెప్ట్ మీద తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ దండోరా సినిమా రానుంది. ఈ సినిమాలో శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.