Gossip garage V.V.Vinayak in planning for the sequel to Adhurs 2
Adhurs 2 : వి.వి.వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 2010లో వచ్చిన అదుర్స్ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ హిట్ జోడీ మళ్లీ రిపీట్ కానుందట. అదుర్స్-2 (Adhurs 2) ప్రాజెక్టు త్వరలో ట్రాక్ ఎక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వినాయక్ ఈ సీక్వెల్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని, ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని టాక్.
అదుర్స్-2లో కూడా ఎన్టీఆర్ మళ్లీ డ్యూయల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా మరింత కొత్త ట్విస్ట్‌లతో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. అదుర్స్-2ను ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని వినాయక్ భావిస్తున్నారట. మొదటి పార్ట్‌లోని చారి పాత్రకు ఉన్న క్రేజ్‌ను మరింత ఎలివేట్ చేసేలా కథను రెడీ చేస్తున్నారని టాక్.
Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. కేరళ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్‌తో పాటు ఎన్టీఆర్ డ్యాన్స్‌లతో ఈ సినిమాను ఓ రేంజ్‌లో తీర్చిదిద్దే ప్లాన్‌లో ఉన్నారట. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కొంత భాగం షూటింగ్ తీసే ఆలోచన కూడా ఉందని, దీనివల్ల కామెడీ సీన్స్ మరింత ఫ్రెష్‌గా ఉంటాయని టీమ్ భావిస్తోందట. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా ఉంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో బ్రహ్మానందం స్థానంలో కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారని ఒక గాసిప్ షికారు చేస్తోంది.
మొదటి పార్ట్‌లో బ్రహ్మానందం భట్టు భట్టాచార్య పాత్ర అభిమానులను ఎంతగానో నవ్వించింది. ఈ సారి సత్యతో మరో రేంజ్ కామెడీ సీన్స్ ప్లాన్ చేస్తున్నారని, ఎన్టీఆర్‌తో కలిసి ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. వినాయక్ గత సినిమాల్లో కామెడీని సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన విధానం చూస్తే, ఈసారి కూడా సత్యతో కొత్త రకం కామెడీ ట్రాక్‌ను అందిస్తారని టాక్. ఇది నిజమైతే అదుర్స్-2లో సత్య-ఎన్టీఆర్ కాంబో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే అవకాశం ఉంది అంటున్నారు.