Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసినవారికి ‘చిరు’ భద్రతా కార్డ్.. గవర్నర్ చేతుల మీదుగా..

తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతులమీదుగా చిరు భద్రతా కార్డులని అందించారు. ఈ కార్డులతో పాటు రక్తదాతలను సత్కరించి.............

Chiranjeevi Blood Bank:  మెగాస్టార్ చిరంజీవి సినిమాలతోనే కాక బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అదొక్కటే కాక నేటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి బాటలోనే ఆయన అభిమానులు కూడా ఎన్నో సార్లు రక్తదానం చేశారు. మెగా అభిమానులు చిరు బాటలో నడుస్తూ ఆయనకి మరింత మంచి పేరుని తెప్పిస్తున్నారు.

తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతులమీదుగా చిరు భద్రతా కార్డులని అందించారు. ఈ కార్డులతో పాటు రక్తదాతలను సత్కరించి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను చిరంజీవితో కలిసి, గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. ఆ తరువాత గవర్నర్ చిరంజీవిని సన్మానించారు. ఈ సందర్భంగా రక్తదాతలపై గవర్నర్, చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

Megastar Chiranjeevi : చిన్న సినిమాల ఈవెంట్స్ కి వెళ్తే నా స్థాయి తగ్గుతుంది అంటారు.. కానీ..

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ”1998లో నేను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాను. దాని వెనుక ఎంతో కష్టం, కృషి ఉంది. ఆ రోజుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉండేది. రక్తదానం చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవారు. అప్పుడు నాకు బ్లడ్ బ్యాంక్ ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఇందుకు నా ఫ్యాన్స్ కూడా సహకరించారు. ఫ్యాన్స్‌గా నా సినిమాలు చూడటం, నన్ను కలవడం, ఫోటోలు దిగడం కంటే కూడా రక్తదానం చేయడమే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. రక్తదానం చేస్తున్న ప్రతీ అభిమానికి నా కృతజ్ఞతలు. కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు సరుకులు అందిస్తున్నప్పుడు నన్ను ప్రోత్సాహించిన మొదటి వ్యక్తి గవర్నర్ గారు. గవర్నర్ ఎన్నోసార్లు ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేశారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..”నేను హౌజ్ సర్జన్‌గా ఉన్నప్పుడు, మా కుటుంబంలోనే ఒకరికి రక్తం అత్యవసరమైంది. ఆ టైంలో పేషెంట్‌ని చూసేందుకు చాలామంది వచ్చారు కానీ పేషెంట్‌కి రక్తం కావాలని, ఎవరైనా దానం చేస్తారా అని అడిగితే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్తదానం అంత సులువు కాదు, ఒక డాక్టర్‌గా నేను ఎన్నో సంఘటనలు, రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్స్‌ని, రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశాను” అని తెలిపారు. చిరంజీవి బాటలో రక్తదానం చేసిన మెగా అభిమానులని అభినందించారు గవర్నర్ తమిళిసై.

ట్రెండింగ్ వార్తలు