Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ సినిమా పక్కన పెట్టి.. ‘మ్యాజిక్’ అంటూ చిన్న సినిమాతో వస్తున్న డైరెక్టర్..

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కొత్త వాళ్ళతో గౌతమ్ తిన్నారి దర్శకత్వంలో 'మ్యాజిక్'(Magic) అనే సినిమా రాబోతున్నట్టు నేడు ప్రకటించారు.

Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ సినిమా పక్కన పెట్టి.. ‘మ్యాజిక్’ అంటూ చిన్న సినిమాతో వస్తున్న డైరెక్టర్..

Gowtam Tinnanuri announced Magic Movie Vijay Devarakonda Movie Postponed Rumours goes Viral

Updated On : January 29, 2024 / 12:52 PM IST

Gowtam Tinnanuri : మళ్ళీరావా, జెర్సీ(Jersey) లాంటి సూపర్ హిట్, మంచి ఎమోషనల్ సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఆ తర్వాత హిందీలో జెర్సీ సినిమాని రీమేక్ చేసాడు. రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా అది ఆగిపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో(Vijay Devarakonda) సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో విజయ్ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగినట్టు తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని, వేరే హీరోయిన్ ని తీసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిన్న సినిమాని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కొత్త వాళ్ళతో గౌతమ్ తిన్నారి దర్శకత్వంలో ‘మ్యాజిక్'(Magic) అనే సినిమా రాబోతున్నట్టు నేడు ప్రకటించారు. ఈ సినిమాకి తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh) సంగీతం అందించడం విశేషం.

Also Read : Mangalavaram : జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన ‘మంగళవారం’ .. నాలుగు అవార్డులతో..

తమ కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి నలుగురు కాలేజీ స్టూడెంట్స్ చేసే ప్రయత్నం చుట్టూ సెన్సిబుల్ టీనేజ్ డ్రామాగా ఈ మ్యాజిక్ అనే సినిమా మ్యూజికల్ గా రాబోతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. అయితే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా చేస్తున్నాడని తెలియడంతో విజయ్ దేవరకొండ సినిమాని పక్కన పెట్టారా? అది ఇంకా లేట్ అవుతుందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలో గౌతమ్ చిన్న సినిమా ఎందుకు చేసాడు అని కూడా అడుగుతున్నారు నెటిజన్లు. అయితే గౌతమ్ లాంటి డైరెక్టర్ ఒక చిన్న సినిమా తీస్తున్నాడంటే బాగుండొచ్చు, మంచి సినిమా అయి ఉండొచ్చు అని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మ్యాజిక్ సినిమా థియేటర్స్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలంటే సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సిందే.