Site icon 10TV Telugu

Gowtam Tinnanuri : మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన ‘కింగ్డమ్’ డైరెక్టర్.. సినిమా గురించి ఏమన్నారంటే..

Gowtam Tinnanuri Interesting Comments on Vijay Deverakonda Kingdom Movie

Gowtam Tinnanuri

Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న రిలీజయి మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లో 82 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎక్కడా కనపడలేదు. సినిమాని చివరి వరకు మెరుగులు దిద్దుతూనే ఉంది ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. దీంతో రిలీజ్ అయ్యాక పలు ఇంటర్వ్యూలు ఇచ్చి నేడు మీడియాతో మాట్లాడాడు గౌతమ్.

కింగ్డమ్ టైటిల్ గురించి మాట్లాడుతూ.. ఏ సినిమాకైనా కథ రాసేటప్పుడు మొదట ఒక టైటిల్ అనుకుంటాం. జెర్సీ సినిమాకి కూడా మొదట అనుకున్న టైటిల్ 36. ఆ తర్వాత జెర్సీ టైటిల్ పెట్టాం. అలాగే కింగ్‌డమ్ కథ రాసే సమయంలో ఇందులో తెగ నాయకుడి పేరు ‘దేవర నాయక’ కావడంతో అదే టైటిల్ అనుకున్నాం. ఎన్టీఆర్ గారి దేవర రావడంతో యుద్ధకాండ అనే టైటిల్ అనుకున్నాం చివరకు కింగ్డమ్ ఫైనల్ చేసాం అని తెలిపాడు.

Also Read : Tamannaah Bhatia : ఇండియన్ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెటర్ తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన తమన్నా.. ఆల్రెడీ పెళ్లి అయిందన్నారు..

సినిమాలో విజయ్, సత్యదేవ్, వెంకటేష్ గురించి మాట్లాడుతూ.. ఈ కథ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. పూర్తిస్థాయిలో డెవలప్ చేయనప్పటికీ కథ రాసి పెట్టుకున్నాను. మొదట విజయ్ గారితో చేద్దామనుకున్న కథ వేరు. కానీ మా ప్రయాణం మొదలైన తరువాత విజయ్ గారికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది అని భావించి చెప్తే ఆయనకు కూడా నచ్చింది. ఈ సినిమాలో విజయ్ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడ మనకు తెలిసిన నటుడు కంటే కూడా కొత్త నటుడైతే చూడటానికి బాగుంటుంది అనుకున్నాం. ఈ క్రమంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ ని చూపించడంతో అతన్ని ఆడిషన్ చేసి తీసుకున్నాం. శివ పాత్ర కోసం ముందు నుంచీ నేను సత్యదేవ్ గారినే అనుకున్నాను. కానీ ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దానికితోడు అప్పుడు కింగ్డమ్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై స్పష్టత లేదు. అందుకే మధ్యలో వేరే వాళ్ళను అనుకున్నాం. మాకు షూటింగ్ విషయంలో స్పష్టత వచ్చాక సత్యదేవ్ గారిని కలిస్తే ఓకే చెప్పారు అని తెలిపాడు.

హృదయం లోపల సాంగ్ ని తీసేయడంపై స్పందిస్తూ.. సినిమా విడుదలైన తరువాత అది చాలా పాపులర్ సాంగ్ కదా ఎందుకు తీసేశారని అందరూ అడుగుతున్నారు. ఓటీటీ వెర్షన్ లోనైనా పెట్టమని అంటున్నారు. కథ రాస్తున్నప్పుడు ఆ సాంగ్ అవసరం అనిపించింది. కానీ ఎడిటింగ్ సమయంలో కథకు అడ్డంకిగా మారింది అనిపించింది. అందుకే నేను, ఎడిటర్ నవీన్ నూలి, నాగవంశీ, విజయ్ అందరం చర్చించుకొని హృదయం లోపల సాంగ్ ని తీసేసాము అని తెలిపారు.

Also Read : Coolie Pre Release Event : హైదరాబాద్ లో ‘కూలీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..

తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు, వంశీ గారికి సంగీతం నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కింగ్‌డమ్ షూటింగ్ కి సమయం పడుతుండటంతో ఆ గ్యాప్ లో మ్యాజిక్ సినిమాని చేసాము. అది షూట్ అయిపోయింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఇస్తే అయిపోయినట్టే. కింగ్డమ్ రెండో భాగానికి సంబంధించి మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ త్వరలో ప్రారంభిస్తాం. పార్ట్-2 కంటే ముందు మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నా. అలాగే కింగ్డమ్ 2 కంటే ముందు ఇంకో సినిమా చేస్తాను అని తెలిపాడు.

Exit mobile version