Tamannaah Bhatia : ఇండియన్ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెటర్ తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన తమన్నా.. ఆల్రెడీ పెళ్లి అయిందన్నారు..

హీరోయిన్స్ ఎవరితో ఒకరితో లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ రావడం సహజం.

Tamannaah Bhatia : ఇండియన్ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెటర్ తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన తమన్నా.. ఆల్రెడీ పెళ్లి అయిందన్నారు..

Tamannaah Bhatia

Updated On : August 4, 2025 / 5:13 PM IST

Tamannaah Bhatia : తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగులో చేస్తుంది. కొన్నాళ్ల క్రితం తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని, వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వాళ్ళే స్వయంగా ప్రకటించారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. ఇటీవలే వాళ్లిద్దరూ విడిపోయారు.

హీరోయిన్స్ ఎవరితో ఒకరితో లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ రావడం సహజం. గతంలో తమన్నా విరాట్ కోహ్లీతో పాటు పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో డేటింగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి. తాజాగా తమన్నా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరి గురించి మాట్లాడింది.

Also See : Coolie Pre Release Event : హైదరాబాద్ లో ‘కూలీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..

తమన్నా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, నేను కలిసి ఒక యాడ్ చేసాము. ఆ యాడ్ షూటింగ్ ఒక్క రోజే అతన్ని నేను కలిసాను. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మళ్ళీ నేను విరాట్ కోహ్లీని కలవలేదు. కానీ అతనితో ప్రేమలో ఉన్నారని రాసారు. అవన్నీ రూమర్స్ మాత్రమే అని తెలిపింది.

ఇక పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్, తమన్నా కలిసి ఓ జ్యువెల్లరీ షాప్ ఈవెంట్లో పాల్గొన్నారు. దీంతో వీరిపై కూడా రూమర్స్ వచ్చాయి. దీనిపై కూడా స్పందిస్తూ.. అబ్దుల్ రజాక్ తో అయితే ఏకంగా నాకు పెళ్లి అయిందన్నారు. ఇంటర్నెట్ లో ఏది పడితే అది రాస్తారు. అవన్నీ కేవలం రూమర్స్, అబద్దాలు మాత్రమే అని తెలిపింది. ప్రస్తుతానికి తమన్నా సింగిల్ గానే ఉంది.

Also Read : Tollywood Strike : టాలీవుడ్ లో సమ్మెపై నిర్మాతల మండలి మీటింగ్.. బంద్ కి ఎలా వెళ్తారు? బయట కంటే ఎక్కువ ఇస్తున్నాం..