Film Fare Awards 2020 : టాప్ లేపిన గల్లీ బాయ్

65వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో గల్లీ బాయ్ చిత్రం టాప్ లేపింది. ఈ చిత్రం 11 అవార్డులను కైవసం చేసుకుంది. గల్లీ బాయ్ చిత్రంలో నటించిన అలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. జోయా అక్తర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ దర్శకుడు అవార్డులను కూడా గెలుచుకున్నారు. అంతేకాదు..ఉత్తమ చిత్ర ట్రోఫీని సైతం ఎగురేసుకపోయింది. విమర్శకుల ప్రశంసలు పొందినందుకు ఉత్తమ సహాయ నటుడు, నటి విభాగాల్లో సిద్ధాంత్ చతుర్వేది, అమృతా సుభాష్‌లకు అవార్డులు వచ్చాయి.
స్డూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రానికి అనన్య పాండేకు ట్రోఫి లభించింది. ఉత్తమ సాహిత్య పురస్కారాన్ని (అప్నా టైమ్ ఆయేగా) అంకుర్ తివారీ గెలుచుకున్నారు. మొత్తానికి 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో గల్లీ బాయ్ అత్యధిక అవార్డులు గెలుచుకుంది.
* బెస్ట్ ఫిల్మ్ : గల్లీ బాయ్
* బెస్ట్ డైరెక్టర్ : జోయా అక్తర్ (గల్లీ బాయ్)
* బెస్ట్ యాక్టర్ (మహిళ) : అలియా భట్
* బెస్ట్ యాక్టర్ (మగ) : రన్ వీర్ సింగ్ (గల్లీబాయ్)
* బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (మహిళ): అమఈత సుభాష్ (గల్లీ బాయ్)
* బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (మగ) : సిద్దార్థ్ చతుర్వేది (గల్లీ బాయ్)
* బెస్ట్ మ్యూజిక్ ఆల్బం : గల్లీ బాయ్, కబీర్ సింగ్
* బెస్ట్ సాహిత్యం : అంకుర్ (గల్లీ బాయ్ (ఆప్నా టైం ఆయేగా))
* బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మగ) : అర్జిత్ సింగ్
* బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) : శిల్పా రావు
* బెస్ట్ డైలాగ్ : విజయ్ మౌర్య (గల్లీ బాయ్)
* బెస్ట్ స్ర్కీన్ ప్లే : రీమా, జోయా అక్తర్ (గల్లీ బాయ్)
* బెస్ట్ ఒరిజినల్ స్టోరీ : అనుభవ్ సిన్హా
* బెస్ట్ యాక్షన్ : వార్
* బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : గల్లీ బాయ్
* బెస్ట్ సినిమాటోగ్రఫీ : గల్లీ బాయ్
* బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్ : గల్లీ బాయ్
Read More : Big Boss 13 విజేత సిద్దార్థ్ శుక్లా..ఫెరీహా ట్వీట్ల కలకలం