Site icon 10TV Telugu

Hiranyakashyap : రానా ‘హిరణ్య కశ్యప’ సినిమా వివాదం.. గుణశేఖర్ వర్సెస్ త్రివిక్రమ్

Gunasekhar Hiranyakashyap Movie issue with Rana Daggubati and Trivikram Srinivas

Gunasekhar Hiranyakashyap Movie issue with Rana Daggubati and Trivikram Srinivas

Rana Trivikram :  గతంలో రానా హీరోగా, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ సినిమా వస్తుందని ప్రకటించారు. ఈ సినిమాపై అంచనాలు కూడా నెలకొన్నాయి. కానీ ఏమైందో ఏమో ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఊసే లేదు. తాజాగా మళ్ళీ ‘హిరణ్య కశ్యప’ సినిమా గురించి వినిపిస్తుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కామిక్ కాన్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ k ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇదే ఈవెంట్ లో రానాకి చెందిన పలు కామిక్ సినిమాలని కూడా ప్రమోట్ చేయనున్నట్టు సమాచారం.

రానా నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా (Spirit Media) నుంచి త్వరలో హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా సిరీస్ అండ్ మూవీస్ రాబోతున్నాయి. వాటిలో ఒకటి రానా హీరోగా నటించబోయే ‘హిరణ్య కశ్యప’ ఒకటి. ప్రముఖ కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ నుంచి తీసుకున్న కథతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కథగా రాస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు మరిన్ని కామిక్ సిరీస్ లు రానా తెరకెక్కించనున్నాడు. ‘హిరణ్య కశ్యప’ కూడా కామిక్ వర్షన్ లోనే తెరకెక్కుతోందని సమాచారం.

అయితే ఈ విషయంలో రానాకి, గుణశేఖర్ కి వివాదం జరిగినట్టు తెలుస్తుంది. గుణశేఖర్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఈ ‘హిరణ్య కశ్యప’ సినిమా గురించి మాట్లాడాడు. గుణశేఖర్ మాట్లాడుతూ.. నేను ‘హిరణ్య కశ్యప’ సినిమా కథని రానా దగ్గరికి తీసుకెళ్ళాను. చేద్దాం అన్నాడు, తర్వాత ఏవో ఇబ్బందులు వచ్చి ఆ కథని పక్కన పెట్టారు. అదే కథని ఇప్పుడు వేరే వాళ్ళతో చేస్తున్నారు. నా కథనే చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఒకవేళ అదే కథని వాళ్ళు ఇంకోలా చేసి, ఇంకోలా చూపిస్తే మాత్రం నాకు అనవసరం. నాకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అన్నారు.

Project K Comic Version : లీకైన ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్.. రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడటానికి వచ్చే దేవుడు..

తాజాగా రానా ‘హిరణ్య కశ్యప’ గురించి ప్రకటన రావడంతో గుణశేఖర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో కొన్ని రోజుల క్రితం నుంచే గుణశేఖర్ తో ‘హిరణ్య కశ్యప’ వివాదం రానా, త్రివిక్రమ్ లతో నడుస్ర్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. రానా త్రివిక్రమ్ తో కలిసి ‘హిరణ్య కశ్యప’ సినిమా చేస్తారా? లేక కామిక్ వర్షన్ చేస్తారా చూడాలి మరి.

Exit mobile version