Project K Comic Version : లీకైన ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్.. రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడటానికి వచ్చే దేవుడు..

అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.

Project K Comic Version : లీకైన ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్.. రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడటానికి వచ్చే దేవుడు..

Project K Comic Version leaked in social media before it presents in San Diego Comic Con Event

Project K Comic Version :  ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K సినిమాని గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో జులై 21న రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, చిత్రయూనిట్ అమెరికాకు చేరుకున్నారు. నిన్న సాయంత్రమే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సూపర్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరింది.

అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఈవెంట్ లో మీడియాకు పోజులు ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ తో పాటు రానా కుడా ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రభాస్ ఎంట్రీ అదిరింది, ప్రభాస్ కొత్త లుక్ బాగుంది అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలకు సంబంధించిన వాటిని, సినిమా కామిక్స్ ని అందరికి తెలియచేసేలా చేసే ఓ ఈవెంట్ ‘కామిక్ కాన్’. ప్రతి సంవత్సరం ‘కామిక్ కాన్’ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది సినిమా ప్రేమికులు, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి విచ్చేస్తారు. ఈ ఈవెంట్ లో ముఖ్యంగా కామిక్ బుక్స్ ని, సినిమాలను కామిక్స్ లాగా ప్రదర్శిస్తారు. అలాగే కామిక్ బుక్స్, సినిమా వాళ్ళు తమ సినిమాలని, బుక్స్ ని ప్రమోట్ చేసుకుంటారు.

దీంతో ప్రాజెక్ట్ K సినిమా కథని కూడా కామిక్ వర్షన్ లో బుక్ లా తయారు చేపించి ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు చిత్రయూనిట్. అయితే ఈ కామిక్ వర్షన్ నుంచి రెండు పేజీలు లీక్ అయ్యాయి. ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంట్లోనే సినిమా కథ అంతా ఉన్నట్టు తెలుస్తుంది. కలియుగం చివర్లో విలన్ ప్రజలని ఇబ్బందులు పెడుతూ పాలిస్తూ ఉంటాడు. అతనే దేవుడని అందరూ అతనికే దండం పెట్టాలని విలన్ మనుషులతో ప్రజలని ఇబ్బందులు పెట్టిస్తూ ఉంటాడు. అలంటి సమయంలో దేవుడిలా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. లీకైన రెండు పేజీలను బట్టి కథ ఇదే అని తెలుస్తుంది. దీని బట్టి విలన్ కమల్ హాసన్ అని, దేవుడు ప్రభాస్ అని తెలుస్తుంది.

Prabhas Grand Entry : హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ.. ప్రభాస్ ఫోటోలు చూశారా??

దీంతో ప్రాజెక్ట్ K సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కలియుగం అంతం, విలన్, దేవుడు, హాలీవుడ్ రేంజ్ సెటప్ ఇవన్నీ సినిమాపై మరిన్ని హైప్ పెంచాయి. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. పలువురు స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.