Guns and Roses song update from og movie
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీరా)(OG). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుంటడంతో మూవీ టీం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా మరో సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Mirai: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మిరాయ్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్?
గన్స్ అండ్ రోజెస్ సాంగ్ రిలీజ్ టైం ను చెప్తూ పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 15న సాయంత్రం 4:50 గంటలకు ఈ సాంగ్ రానున్నట్లు ప్రకటించారు. ఓజీలో గాంభీర్యాన్ని, ప్రేమను కలుపుతూ ఈ సాంగ్ ఉండబోతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా మోస్ట్ ప్రొవెర్ ఫుల్ గా ఉండబోతుంటే ఈ పాట. మరి ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ కి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఈ సాంగ్ కి కూడా అదే లెవల్లో రెస్పాన్స్ వస్తుంది అని టీం భావిస్తున్నారు.
#GunsNRoses 🔫🌹
A SURESHOT BLOCKBUSTER song dropping tomorrow at 4:50 PM 🎯💯 #OG #TheyCallHimOG pic.twitter.com/V8IWj9Tdbq
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025