Mirai: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మిరాయ్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్?

మిరాయ్.. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది(Mirai). తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mirai: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మిరాయ్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్?

Tollywood hero Nani has dropped out of the film Mirai.

Updated On : September 14, 2025 / 11:51 AM IST

Mirai: మిరాయ్.. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ గ్రాఫిక్స్ తో, ఫాంటసీ అండ్ అడ్వెంచర్ మూవీగా వచ్చిన మిరాయ్ ఆడియన్స్ ను వివరీతంగా ఆకట్టుకుంది. దాంతో, ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ. 27 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక రెండు రోజులు కలుపుకొని ఏకంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది మిరాయ్(Mirai). ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Sai Durga Tej: బ్రేకప్ స్టోరీ చెప్పిన సాయి దుర్గ తేజ్.. పాపం అమ్మాయే వదిలేసిందట!

ఇదిలా ఉంటే, చిత్ర దర్శకుడు మిరాయ్ సినిమా గురించి ఆసక్తి కార కామెంట్స్ చేశాడు. ఈ కథను మూడు సంవత్సరాల క్రితమే రాసుకున్నాడట. మొదట ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జను అనుకోలేదట. ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నానికి వినిపించాడట దర్శకుడు. ఆ కథ కూడా నానికి చాలా బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత కూడా చాలా మంది హీరోలని అనుకున్నాడట దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.

కానీ, అదే సమయంలో తేజ సజ్జ హనుమాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ కథ కాబట్టి తేజ సజ్జ అయితేనే బాగుంటాడని ఫిక్స్ అయ్యాడట కార్తీక్. అలా హనుమాన్ రిలీజ్ కు ముందే మిరాయ్ సినిమా కథను తేజ సజ్జకు చెప్పి ఒపించాడట. అలా నాని ప్లేస్ లో తేజ సజ్జ హీరోగా చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ సినిమా హనుమాన్ లాంగ్ రన్ కలెక్షన్స్ ను దాటేసేలా కనిపిస్తోంది.