Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి.. ఏం జరిగింది..?

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ..

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి కలకలం రేపుతోంది. ఈరోజు (ఏప్రిల్ 14) ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ.. గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపాడు. మొత్తం మూడుసార్లు తుపాకీని ఫైర్ చేసారు. అయితే ఆ వ్యక్తి ఎవరు..? ఎందుకు ఫైరింగ్ చేసారు..? అనేవి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ముంబై పోలీసులు దీని పై విచారణ మొదలుపెట్టారు.

కాగా గత సంవత్సరం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. 1998 కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపడం అనేది తమ సమాజాన్ని కించపరిచినట్లు అని చెబుతూ.. సల్మాన్ ఖాన్ ని చంపేస్తాను అంటూ కామెంట్స్ చేసారు. ఈక్రమంలోనే గతంలో బిష్ణోయ్ తన అనుచరుడు సంపత్ నెహ్రాని సల్మాన్ ఖాన్ నివాసం బాంద్రా వద్ద నిఘా పెట్టించాడు. అయితే హర్యానా పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ నెహ్రుని పట్టుకొని అరెస్ట్ చేసారు.

Read also : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

ఇక ఆ తరువాత ముంబై పోలీస్ సల్మాన్ ఖాన్ కి Y+ క్యాటగిరీ బందోబస్త్ ని ఏర్పాటు చేసారు. ఇంతటి బందోబస్త్ ఏర్పాటు తరువాత కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ గన్ షాట్స్ సల్మాన్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో ఓ సినిమాకి ఇటీవలే సైన్ చేసారు. ఆ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాజిద్ నదివాలా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు