Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ లో గౌరవ డాక్టరేట్‌ అందుకున్న రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

ram charan

Game Changer : తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతుంది. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మేకర్స్ ఇప్పటికి వరకు తెలియజేయలేదు. తాజాగా ఈ మూవీ విదుదల తేదీ గురించి రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్‌ అందించిన సంగతి తెలిసిందే. నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. “నేను మొదటిసారి ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాను. శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరిలో రిలీజ్ అవుతుంది. మొత్తం ఐదు భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Also read : Ram Charan Video: డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

కాగా ఈ సినిమాని దివాళీ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్ ని రిలీజ్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట ట్రేండింగ్ లో నిలిచింది.