Guntur Karam pic leak and this movie had political touch too
Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న 28వ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. బ్రేక్ లతో కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఈ మూవీ ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఆ షెడ్యూల్ లో ప్రధాన పాత్రల పై చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు. తాజాగా ఆ సెట్ లోని ఒక పిక్ నెట్టింట లీక్ అయ్యింది. ఆ ఫోటో చూస్తుంటే ఈ మూవీలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని అర్ధమవుతుంది.
Jeevitha – Rajasekhar : పరువు నష్టం దావా కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలుశిక్ష.. బెయిల్ మంజూరు
ఇంతకీ ఆ లీక్ అయినా ఫొటోలో ఏముందంటే.. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఫ్లెక్సీ ఒకటి కనపడుతోంది. ఆ ఫ్లెక్సీలో ఇలా రాసి ఉంది.. “ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవురాలైన శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా”. ఈ ఫ్లెక్సీని బట్టి ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ రాజకీయ నేతగా కనిపిస్తాడని అర్ధమవుతుంది. దీంతో ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.
#GunturKaaram pic.twitter.com/McedNKTyBs
— ???????? ???? ❤️? (@urstruly_srii) July 18, 2023
కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తున్నారు. మొన్న జరిగిన షెడ్యూల్ లో మీనాక్షి చౌదరి పాల్గొంది. అలాగే జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని శరేవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.