DeAr Review : ‘డియర్’ మూవీ రివ్యూ.. భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు..

'డియర్' సినిమాలో భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు ఏంటి?

GV Prakash Aishwarya Rajesh DeAr Movie Review

DeAr Movie Review : తమిళ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్(GV Prakash), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) జంటగా రోహిణి, కాళీ వెంకట్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా డియర్. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో, వరుణ్, అభిషేక్, పృథ్వీరాజ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో నిన్నే రిలీజ్ అవ్వగా తెలుగులో డబ్బింగ్ వర్షన్ తో డియర్ నేడు ఏప్రిల్ 12న రిలీజయింది.

కథ విషయానికొస్తే.. అర్జున్ (జీవీ ప్రకాష్) టీవిలో న్యూస్ రీడర్ గా పనిచేస్తాడు. టీవిలో ఫేస్ ఫ్రెష్ గా కనపడాలని రోజు 8 గంటలు కచ్చితంగా నిద్రపోతాడు. కానీ అతనికి ఏ చిన్న శబ్దం వినిపించినా మెలకువ వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తికి దీపిక(ఐశ్వర్య రాజేష్)తో పెళ్లి జరుగుతుంది. దీపిక నిద్రపోతే భయంకరంగా గురక పెడుతుంది. కొన్ని రోజులు అర్జున్ కి తన భార్య గురకతో చాలా భారంగా నడుస్తుంది. దీంతో నిద్ర తక్కువయి అర్జున్ బాధపడుతూ ఉంటాడు. ఓ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసే సమయంలో అర్జున్ కి నిద్ర రావడంతో ఆఫీస్ బాత్రూంలో నిద్రపోవడంతో అతని ఉద్యోగం పోతుంది.

దీంతో తన భార్య మీద చిరాకు వచ్చిన అర్జున్ తన భార్యకు విడాకులు ఇవ్వలనుకుంటాడు. తన తల్లి(రోహిణి), అన్నయ్య(కాళీ వెంకట్)చెప్పినా వినిపించుకోకుండా విడాకులకు అప్లై చేస్తాడు. అదే సమయంలో దీపిక ప్రగ్నెంట్ అని తెలుస్తుంది. మరి అర్జున్ తన భార్య గురకతో ఎన్ని బాధలు పడ్డాడు? విడాకులు వచ్చాయా లేక కలిసిపోయారా? ఈ మధ్యలో అర్జున్ తండ్రి కథేంటి? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. డియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి గతంలో తమిళ్ లో వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాతో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. గుడ్ నైట్ సినిమాలో భర్తకు గురక ఇబ్బంది ఉంటే భార్య పడే కష్టాలు ఏంటి అని చూపించారు. ఇందులో దానికి రివర్స్ గా భార్యకు గురక ఉంటే భర్త పడే ఇబ్బందులు ఏంటి అని చూపించారు. సిమిలర్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కథనంలో కొత్తదనం ఉండకపోతే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడం కష్టం. ఫస్ట్ హాఫ్ అంతా భార్య గురక వల్ల భర్త పడే కష్టాలతో సాగించి అక్కడక్కడా మాత్రం కొంచెం కామెడీ వర్కౌట్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ కథలోంచి పక్కకి వెళ్లి హీరో తల్లితందృలు మీద కథ నడిపిస్తారు. అక్కడ ఎమోషన్ ని పండించాలని చూసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక సినిమాకి డియర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.

Also Read : David Warner : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వార్న‌ర్‌.. న‌వ్వులే న‌వ్వుల్‌.. కెమెరాను బ‌ద్ద‌లు కొట్టి..

నటీనటుల పర్ఫార్మెన్స్.. జీవీ ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ కూడా మంచి నటీనటులు. ఆల్రెడీ నటనలో ఈ ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో ఈ ఇద్దరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ దర్శకుడు వీరిద్దర్నీ సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. తల్లి పాత్రలో రోహిణి మెప్పిస్తుంది. హీరో అన్నయ్యగా కాళీ వెంకట్ ఓకే అనిపించాడు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. అటు హీరోగా మెప్పించి ఇటు మ్యూజిక్ తో కూడా మెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథ ఆల్రెడీ గుడ్ నైట్ సినిమా కోర్ పాయింట్ తీసుకున్నా కథనం కొత్తగా ట్రై చేసి దానికి పేరెంట్స్ ఎమోషన్ ని జతచేశారు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘డియర్’ సినిమాలో భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు ఏంటి? ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి, వాటిని అర్ధం చేసుకొని కలిసిమెలిసి బతకాలి అనే పాయింట్ ని చూపించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు