Telugu New Films (1)
Telugu New Films: ప్రతి ఏడాది కొత్త సినిమాల విడుదలకు కొన్ని ముహూర్తాలుంటాయి. సహజంగా ప్రతి వారం శుక్రవారంతో పాటు సంక్రాంతి, దసరా, వేసవి కాలం ఇలా కొన్ని సమయాల్లో సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే మేకర్స్ కూడా ఆయా సమయాల్లో తమ సినిమాల విడుదలకు సన్నాహాలు చేసుకుంటారు. ఇందులో సమ్మర్ కొత్త సినిమాలకు భారీ మార్కెట్ ఉంటుంది. కానీ ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ లో సమ్మర్ సీజన్ కొట్టుకుపోయింది. అప్పటి నుండి సిద్దమైన సినిమాలన్నీ ల్యాబులలో మగ్గిపోతున్నాయి.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమేర కొత్త సినిమాలకు స్కోప్ లభించింది. ఏపీలో కొన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణలో కొత్త సినిమాల విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు. అందుకే ఈ దసరాకి తెలుగు అప్ కమింగ్ సినిమాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అరడజను సినిమాలకు పైగా ఈ దసరాకి ముహూర్తం ఫిక్స్ చేసుకోగా ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద ఈ దసరాకి తెలుగు సినిమా ఇండస్ట్రీ రూ.200 కోట్లకు పైగా మార్కెట్ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
ఈ దసరాకి వచ్చే కొత్త సినిమాలలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా అఖండ, అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్, శర్వానంద్-సిద్దార్థ్ మహాసముద్రం, వైష్ణవ్ తేజ్ కొండపోలం, దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాలు ఉండగా మరికొన్ని సినిమాలు ఈ బాటలో రానున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ఈ దసరా పండగను మరింత ఆహ్లదకరంగా మారుస్తాయో చూడాలి.