Hamsa Nandini : కాన్సర్‌ని జయించిన హంస నందిని..

ప్రభాస్ మిర్చి సినిమాలో 'మిర్చి మిర్చి' అంటూ దుమ్ము దులిపేసిన "హంస నందిని".. గత కొంతకాలంగా బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతుంది. క్రిందటి ఏడాది డిసెంబర్ లో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా...

Hamsa Nandini : కాన్సర్‌ని జయించిన హంస నందిని..

Hamsa Nandini cured from cancer

Updated On : December 9, 2022 / 11:01 AM IST

Hamsa Nandini : 2015లో వచ్చిన ‘ఒక్కటవుదాం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి ‘హంస నందిని’. ఆ తరువాత దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘అనుమానాస్పదం’ చిత్రంతో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఈ హీరోయిన్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ మూవీ. ఆ సినిమాలో ‘మిర్చి మిర్చి’ అంటూ స్పెషల్ సాంగ్ లో దుమ్ము దులిపేసిన ఈ భామ వరుస ఆఫర్లు అందుకుంది.

C Kalyan : సంక్రాంతి సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసింది తప్పు..

ఇక అక్కడి నుంచి స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్ అండ్ స్పెషల్ అప్పీరెన్స్ లు ఇస్తూ అలరిస్తూ వచ్చింది. అయితే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘పంతం’ సినిమా తరువాత ఈ భామ సినిమాలకు దూరమైంది. గత కొంతకాలంగా హంస నందిని బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతుంది. క్రిందటి ఏడాది డిసెంబర్ లో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకి తెలియజేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో పాల్గొనాలని అభిమానుల, ఇండస్ట్రీ ప్రముఖులు ధైర్యం చెబుతూ కామెంట్లు చేశారు.

కాగా సంవత్సరం పాటు కాన్సర్ తో పోరాడిని హంస నందిని.. ఎట్టకేలకు దానిని జయించి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్ లోని విజువల్స్ వీడియో తీసి పోస్ట్ చేస్తూ.. “నా కో స్టార్స్ ని, సినిమా ప్రపంచాని చాలా మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమా సెట్ లోకి అడుగుపెట్టడం పునర్జనంలా ఉంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)