C Kalyan : సంక్రాంతి సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసింది తప్పు..

ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి రిలీజ్ సినిమాల మీదే చర్చ జరుగుతుంది. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో ఈ సారి సంక్రాంతి బరిలోకి దిగితుంటే దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా బరిలోకి దింపుతున్నాడు. దీంతో....................

C Kalyan : సంక్రాంతి సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసింది తప్పు..

C Kalyan comments on sankranthi movies issue

C Kalyan :  ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి రిలీజ్ సినిమాల మీదే చర్చ జరుగుతుంది. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో ఈ సారి సంక్రాంతి బరిలోకి దిగితుంటే దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా బరిలోకి దింపుతున్నాడు. దీంతో వివాదం మొదలైంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంక్రాంతికి తెలుగు సినిమాలకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, తెలుగు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలకి చివరి ప్రాధాన్యత ఇవ్వాలని నోటిస్ రిలీజ్ చేశారు.

దీంతో వివాదం మరింత ముదిరింది. అయినా దిల్ రాజు తన పట్టు నిలుపుకోవడానికి ఇప్పటికే చాలా థియేటర్స్ ని తన వారసుడు సినిమా కోసం బ్లాక్ చేసి ఉంచాడు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కూడా సంక్రాంతికి తెలుగు సినిమాలే రిలీజ్ చేస్తామని నోటిస్ ఇచ్చారు. అసలు చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్స్ దొరకవు, జనాలు కూడా వాళ్ళ సినిమాలకే వెళ్తారు. అయినా దిల్ రాజు మాత్రం వదలట్లేదు. దీంతో సంక్రాంతికి ముక్కోణపు పోటీ జరగనుంది.

Nayanthara CONNECT : భయపెడుతున్న ‘కనెక్ట్’.. అర్ధరాత్రి 12 గంటలకు నయనతార ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్..

తాజాగా దీనిపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేది తప్పు. చిరంజీవి, బాలకృష్ణ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళవే. ఆ నిర్మాణ సంస్థకి ప్రాబ్లమ్ లేనప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఎందుకు. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడటం నూరు శాతం తప్పే అని వ్యాఖ్యానించారు. మరి దీనిపై కౌన్సిల్ మెంబర్లు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.