The Award : చేనేత కళాకారులపై సినిమా.. ది అవార్డ్ ట్రైలర్ రిలీజ్..

తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చేతుల ది అవార్డ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Hand loom Based Story The Award Movie Trailer Released by Suresh Babu

The Award : చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూదాన్ పోచంపల్లికి చెందిన యువ డైరెక్టర్ బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో శివరామ్ రెడ్డి, సాయి చందన ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ది అవార్డ్ 1996’. పలు యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మెగా మేజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ సి సమర్పణలో చిరందాసు ధనుంజయ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు.

Also Read : Lavanya Tripathi : పెళ్లి తర్వాత మొదటి సినిమాని ప్రారంభించిన మెగా కోడలు.. ‘సతీ లీలావతి’ అంటున్న లావణ్య త్రిపాఠి..

తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చేతుల ది అవార్డ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ రిలీజ్ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ.. ది అవార్డు 1996 ట్రైలర్ చాలా బాగుంది. మంచి హృదయంతో ఈ సినిమా తీశారు. చేనేత కళాకారులు, వారి సమస్యలను సమాజానికి చూపించడం అభినందనీయం. సోషల్ రిలవెంట్ టాపిక్ ఇది అని అన్నారు.

Also Read : Bunny Vasu : మళ్ళీ జనసేన నుంచి పోటీ గురించి మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. పవన్ గారి దగ్గర అలా పనిచేస్తే..

నిర్మాత ధనుంజయ్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను సురేష్ బాబు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ నచ్చి సినిమా గురించి మరింత అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ కంటే సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. త్వరలోనే ది అవార్డ్ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు.