Bunny Vasu : మళ్ళీ జనసేన నుంచి పోటీ గురించి మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. పవన్ గారి దగ్గర అలా పనిచేస్తే..
తాజాగా మరోసారి తన రాజకీయ అరంగ్రేటం గురించి మాట్లాడారు బన్నీ వాసు.

Bunny Vasu Comments on his Political Entry with Janasena in Thandel Promotions
Bunny Vasu : పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చి, అల్లు అర్జున్ ఫ్రెండ్ గా అందరికి పరిచయమయి గీత ఆర్ట్స్ లో ఇప్పుడు నిర్మాతగా ఎదిగారు బన్నీ వాసు. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో గీత్ ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మీడియాతో మాట్లాడారు.
అయితే గతంలో బన్నీ వాసు జనసేన నుంచి 2024 లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వచ్చాయి. బన్నీ వాసు కూడా ఆ వార్తలు నిజమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయమని అడిగారు కానీ నేను అప్పుడు సిద్ధంగా లేకపోవడం వల్ల పోటీ చేయలేదు అని తెలిపారు. గోదావరి జిల్లాల్లో జనసేన విజయంలో బన్నీ వాసు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో స్వయంగా జనసేనకు ప్రచారం చేసారు బన్నీ వాసు. ఎన్నికల సమయంలో బన్నీ వాసుని ఎన్నికల ప్రచార చైర్మన్ గా కూడా నియమించారు పవన్.
తాజాగా మరోసారి తన రాజకీయ అరంగ్రేటం గురించి మాట్లాడారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు పోటీ చేయమని మంచి అవకాశం వచ్చింది. కానీ నేను రెండు రకాలుగా చూసుకోవాలి. ఒకటి నా ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి. రాజకీయాలు ఈ రోజుల్లో ఈజీ కాదు . రెండోది నా చుట్టూ ఉన్న బాధ్యతలు కూడా చూసుకోవాలి. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి ప్రజా జీవితంలోకి వెళ్ళాలి. అక్కడ పోటీ చేసి వచ్చి ఇక్కడ సినిమాల్లో కూర్చుంటే కుదరదు. పోటీ చేసిన దగ్గర ఉండాలి. కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి తో జర్నీ చేస్తున్నప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే పక్కన పెట్టారంటే మళ్ళీ వెళ్ళడానికి కుదరదు. అందుకే నేను అంత కమిట్మెంట్ ఇచ్చే సమయానికి, నేను ఇక్కడ అన్ని వదులుకొని ప్రజా జీవితంలోకి వెళ్లినా నాకు, నా ఫ్యామిలీలకి ఎలాంటి ఫైన్షియల్ ఇబందులు లేవు అనుకున్నప్పుడు నేను వెళ్తాను. అంతేకాని ఇప్పుడు నేను ఇంకా ఎదుగుతున్న సమయంలో అటు వెళ్లడం మంచిది కాదు అనిపించి నేనే ఆగిపోయాను. అని అన్నారు.
అయితే బన్నీ వాసు 2029లో జనసేన తరపున గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తారని సమాచారం. మరి అప్పటి వరకు బన్నీ వాసు ఫైనాన్షియల్ గా రెడీ అయి పోటీకి రెడీగా ఉంటారా? జనసేన నుంచి మళ్ళీ టికెట్ ఆఫర్ చేస్తారా చూడాలి. ఇక బన్నీ వాసు నిర్మాతగా మారిన తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మొదటి సినిమా తండేల్. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 70 కోట్ల పైనే బడ్జెట్ అయిందని సమాచారం.