Siddhu Jonnalagadda : ఇదేం వెరైటీ.. టైటిల్ మార్చి రీ రిలీజ్ చేస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా.. ఎప్పుడో తెలుసా?

తాజాగా మరో సినిమా రీ రిలీజ్ అవుతుంది.

Siddhu Jonnalagadda : ఇదేం వెరైటీ.. టైటిల్ మార్చి రీ రిలీజ్ చేస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా.. ఎప్పుడో తెలుసా?

Siddhu Jonnalagadda Rana Movie Re Release in Theaters with Title Change Details Here

Updated On : February 3, 2025 / 12:57 PM IST

Siddhu Jonnalagadda : ఇటీవల పలు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలు, కాస్త యావరేజ్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సినిమా రీ రిలీజ్ అవుతుంది. సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు కంటే ముందు కూడా పలు మంచి సినిమాలు తీసాడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా కరోనా సమయంలో డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజయింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది.

సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మాతలుగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని.. హీరోయిన్స్ గా తెరకెక్కింది కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా. ఓటీటీలో రిలీజయి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ నడిపే ఓ అబ్బాయి కథగా రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాని తెరకెక్కించారు.

Also Read : Sankranthiki Vasthunam : ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు వెంకీ మామా.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ఫ‌స్ట్ రీజిన‌ల్ ఫిల్మ్‌..

అయితే ఇప్పుడు కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ రీ రిలీజ్ లో వెరైటీగా ఈ సినిమా టైటిల్ మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి రానా, సిద్ధూ, డైరెక్టర్ రవికాంత్ కలిసి ఓ ప్రమోషనల్ వీడియో చేసి రిలీజ్ చేసారు. టైటిల్ మార్చి, సిద్ధూ ట్యాగ్ స్టార్ బాయ్ కూడా యాడ్ చేసి వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ఈ సినిమాని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలా రీ రిలీజ్ లో టైటిల్ మార్చి రిలీజ్ చేయడం కొత్తగా ఉందే అని ఆశ్చర్యపోతున్నారు.

Siddhu Jonnalagadda Rana Movie Re Release in Theaters with Title Change Details Here

Also Read : Kannappa : రుద్రుడిగా ప్రభాస్.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిందిగా..

రానా, సిద్ధూ, రవికాంత్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం సిద్ధూ అభిమానులు, లవర్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఫిబ్రవరి 14న డైరెక్ట్ రిలీజ్ సినిమాలే చాలా ఉన్నాయి. విశ్వక్ సేన్ లైలా, కిరణ్ అబ్బవరం దిల్ రుబా, బ్రహ్మ ఆనందం.. సినిమాలతో పాటు మరి కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్యలో ఈ రీ రిలీజ్ సినిమా ఆడుతుందా చూడాలి.