Kannappa : రుద్రుడిగా ప్రభాస్.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిందిగా..

మంచు విష్ణు క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేసింది.

Kannappa : రుద్రుడిగా ప్రభాస్.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిందిగా..

Prabhas look out now From kannappa movie

Updated On : February 3, 2025 / 11:26 AM IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కున్న చిత్రం క‌న్న‌ప్ప‌. ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్, న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్ లాల్‌, శ‌ర‌త్ కుమార్‌, మోహ‌న్ బాబు, మ‌ధుబాల.. ఇలా ఎంతో మంది స్టార్ న‌టీన‌టులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ న‌టీన‌టుల పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. మంచు విష్ణు, మోహ‌న్ బాబు, కాజ‌ల్ అగ‌ర్వాల్, శ‌ర‌త్ కుమార్, అక్ష‌ర్ కుమార్‌ ఇలా అంద‌రి పాత్ర‌ల పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు.

Kiran Abbavaram : ఇంట్రో వీడియోతోనే ఫుల్ గా నవ్వించిన కిరణ్ అబ్బవరం.. కిరణ్ కొత్త సినిమా అనౌన్స్..

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పోస్ట‌ర్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రుద్రుడిగా క‌నిపించ‌నున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో మెడ‌లో రుద్రాక్ష మాల‌లు ధ‌రించి చేతిలో ఓ విచిత్ర మైన ఆయుధాన్ని ప్ర‌భాస్ ప‌ట్టుకున్నాడు. ప్ర‌ళ‌య కాల రుద్రుడు, త్రికాల మార్గ‌ద‌ర్శ‌కుడు, శివాజ్ఞ ప‌రిపాల‌కుడు అంటూ ఆ పోస్టర్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట‌ర్ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

Cm Chandrababu : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అడ‌వుల్లోనే దాదాపుగా ఈ మూవీని చిత్రీక‌రించారు. కొంత భాగం రామోజీ ఫిలిం స్టూడియోలో సెట్ వేసి షూట్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారని టాక్‌.