Hansika Coming Soon with Horror Film Titled as Sri Gandhari
Sri Gandhari : యాపిల్ బ్యూటీ హన్సిక ఒకప్పుడు ఎన్నో కమర్షియల్ సినిమాలతో హిట్స్ కొట్టి గత కొన్నాళ్లుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, కంటెంట్ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హారర్ జానర్ లో భయపెట్టడానికి వస్తుంది హన్సిక. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని విక్రమ్ కుమార్ రెజింతల సమర్పణలో సరస్వతి డెవలపర్స్, లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Aditi Rao Hydari-Siddharth : అప్పుడు సింపుల్ గా.. ఇప్పుడు గ్రాండ్ గా.. మళ్ళీ పెళ్లి చేసుకున్న సిద్దార్థ్..
శ్రీ గాంధారి సినిమా తెలుగు – తమిళ్ లో త్వరలోనే రిలీజ్ కాబోతుంది. గతంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ‘గంధర్వ కోట’ అనే పురాతన బిల్డింగ్ కి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేసే హన్సికకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ కోట రహస్యం ఏంటి? గతంలో ఆ కోటలో ఏం జరిగింది అని పీరియాడిక్ హారర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.
శ్రీ గాంధారి సినిమాలో హన్సిక మెయిన్ లీడ్ నటించగా మెట్రో శిరీష్, మయిల్‌సామి, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా.. పలువురు తమిళ్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలు పోషించారు.