Hansika wedding video will stream on Disney Plus Hotstar from February 10th
Hansika : సెలబ్రిటీల లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అభిమానులకి, సాధారణ ప్రేక్షకులకి ఆతృతగా ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని తెలుసుకోవాలని చాలామంది తెగ ఆరాటపడతారు. ఇక వాళ్ళ పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు లాంటివి అయితే ఆ ఫోటోలు, వీడియోలు చేసేయాలని అనుకుంటారు. దీంతో ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు అభిమానులు, ప్రేక్షకుల ఆత్రుతని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
అందుకే వాళ్ళ పెళ్లి, నిశ్చితార్థం, పర్సనల్ లైఫ్ ని కూడా వీడియోల రూపంలో యూట్యూబ్, ఓటీటీలలో పెడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది సెలబ్రిటీలు. ఇక స్టార్ సెలబ్రిటీలు అయితే తమ పెళ్లి వీడియోల్ని అధికారికంగా పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలకి అమ్ముకుంటున్నారు. ఇటీవల నయనతార విగ్నేష్ శివన్ తో జరిగిన తన వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఎక్కువ ధరకు అమ్ముకుంది. వారి పెళ్లి వీడియో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ పెళ్లి వీడియోని ఎవరైనా చూడొచ్చు.
ఇప్పుడు నయనతార బాటలోనే మరో హీరోయిన్ కూడా వెళ్ళింది. యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఆ సమయంలో వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి వీడియో మాత్రం ఇప్పుడు ఓ ఓటీటీలోకి రానుంది. హన్సిక, సోహైల్ పెళ్లి వీడియో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. దీనికి ఆ ఓటీటీ హన్సికకు భారీగానే డబ్బులు చెల్లించిందంట. ఈ పెళ్ళికి సంబంధించి తాజాగా హన్సిక లవ్ షాదీ డ్రామా అనే టైటిల్ తో ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో హన్సిక పెళ్లి వీడియో కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలా స్టార్ సెలబ్రిటీలు తమ పెళ్లి, నిశ్చితార్థం వీడియోల్ని ఓటీటీలకు అమ్ముకుంటుంటే చిన్న సెలబ్రిటీలు యూట్యూబ్ లో పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు.
Actress @ihansika 's wedding celebration teaser out now @DisneyPlusHS #loveshaadidrama
#SohaelKhaturiya #HS #HansikawedsSohael #hansikamotwaniwedding #HansikaMotwani #SohaelKhaturiya https://t.co/GjTh3ViXAG pic.twitter.com/uMWaBEAENb
— Ramesh Bala (@rameshlaus) January 30, 2023