Hanuman : ‘హనుమాన్’ 100 రోజులు.. ఇంకా ఎన్ని సెంటర్స్‌లో ఆడుతుందో తెలుసా?

హనుమాన్ సినిమా చాలా రోజుల తర్వాత సరికొత్త రికార్డులను సెట్ చేసింది.

Hanuman Movie Creates new History after so many Days in 100 days Theatrical Running

Hanuman 100 Days : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా హనుమంతుడి రిఫరెన్స్ తో సూపర్ హీరో సినిమాగా ఇటీవల సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్యలో చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్స్, సెంటర్స్, డేస్.. ఇలా అన్ని విషయాల్లోనూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

హనుమాన్ సినిమా దాదాపు మొత్తంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ తో అదరగొట్టింది. గతంలో ఒక సినిమా 100 రోజులు, 50 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్స్ లో ఆడింది అని గర్వంగా చెప్పకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎంత స్టార్ హీరో సినిమా అయినా ఓ రెండు వారాలు థియేటర్స్ లో కలెక్షన్స్ వసూలు చేసుకొని వెళ్ళిపోతుంది.

Also Read : Supritha : అర్ధరాత్రుళ్లు షూటింగ్స్‌లో సుప్రీత.. ఫస్ట్ సినిమా కోసం బాగా కష్టపడుతున్న సురేఖవాణి కూతురు..

ఈ విషయంలో కూడా హనుమాన్ సినిమా చాలా రోజుల తర్వాత సరికొత్త రికార్డులను సెట్ చేసింది. హనుమాన్ 300 సెంటర్స్ లో 30 రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఏకంగా 150 సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. తాజాగా నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్ ఇంకా 25 సెంటర్స్ లో ఆడుతుంది. 25 సెంటర్స్ లో హనుమాన్ 100 రోజులు ఆడుతుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక హనుమాన్ సినిమా తెలుగులో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.