Supritha : అర్ధరాత్రుళ్లు షూటింగ్స్‌లో సుప్రీత.. ఫస్ట్ సినిమా కోసం బాగా కష్టపడుతున్న సురేఖవాణి కూతురు..

మొదటి సినిమా కోసం సుప్రీత బాగానే కష్టపడుతుంది.

Supritha : అర్ధరాత్రుళ్లు షూటింగ్స్‌లో సుప్రీత.. ఫస్ట్ సినిమా కోసం బాగా కష్టపడుతున్న సురేఖవాణి కూతురు..

Surekha Vani Daughter Supritha Hard work for First Movie

Updated On : April 22, 2024 / 11:14 AM IST

Supritha : సురేఖవాణి(Surekha Vani) కూతురిగా సుప్రీత అందరికి పరిచయమే. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పెడుతూ, యాక్టివ్ గా ఉంటూ హడావిడి చేస్తుంది. ఆల్రెడీ ప్రైవేట్ ఆల్బమ్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన సుప్రీత త్వరలో హీరోయిన్ గా రాబోతుంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్ గా ఓ లవ్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతుంది.

మొదటి సినిమా కోసం సుప్రీత బాగానే కష్టపడుతుంది. అప్పుడపుడు షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది సుప్రీత. తాజాగా అర్ధరాత్రి 1.45 కి కూడా షూటింగ్ చేస్తున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే రాత్రి పూట షూటింగ్ సెట్ నుంచి అమర్ దీప్, టేస్టీ తేజ, శుభశ్రీలతో కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Shahrukh – Suhana : కూతురు కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చుపెడుతున్న షారుఖ్.. హీరోయిన్ గా నిలబెట్టాలని..

దీంతో సుప్రీత షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారగా మొదటి సినిమా కోసం సుప్రీత బాగా కష్టపడుతున్నట్టు ఉంది, స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సురేఖవాణి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినట్టు సుప్రీత ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అవుతుందా చూడాలి. సుప్రీత మొదటి సినిమా కోసం ఆమె సోషల్ మీడియా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

Surekha Vani Daughter Supritha Hard work for First Movie