Shahrukh – Suhana : కూతురు కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చుపెడుతున్న షారుఖ్.. హీరోయిన్ గా నిలబెట్టాలని..

సుహానా ఖాన్ కి థియేట్రికల్ డెబ్యూట్ గ్రాండ్ గా ఇవ్వాలని, మొదటి సినిమానే హిట్ కొట్టి సుహానాని హీరోయిన్ గా నిలబెట్టాలని షారుఖ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.

Shahrukh – Suhana : కూతురు కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చుపెడుతున్న షారుఖ్.. హీరోయిన్ గా నిలబెట్టాలని..

Shah Rukh Khan Trying to make her Daughter Suhana Khan best Theatrical Entry

Shahrukh – Suhana : షారుఖ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సొంతంగా కష్టపడి బాలీవుడ్ ని రూల్ చేసే స్థాయికి ఎదిగాడు. మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు షారుఖ్ ఖాన్. కొన్నాళ్ల క్రితం వరుస ఫ్లాప్స్ చూసి సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో అంతా షారుఖ్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ గత సంవత్సరం పఠాన్, జవాన్, డంకి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

ఇక షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ త్వరలో డైరెక్టర్ గా అరంగ్రేటం చేయబోతున్నాడు. కూతురు సుహానా ఖాన్ ఇటీవలే ‘ది ఆర్చీస్’ అనే నెట్ ఫ్లిక్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. పైగా ఈ సినిమాలో సుహానా యాక్టింగ్ కి నెగిటివ్ మార్కులే పడ్డాయి. సుహానా ఖాన్ ఇప్పటికే పలు యాడ్స్ తో, సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ అవుతుంది. సుహానా కూడా స్టార్ హీరోయిన్ కావాలనుకుంటుంది. దీంతో సుహానా కోసం స్వయంగా షారుఖ్ రంగంలోకి దిగారు.

Also Read : Jr NTR : ‘వార్ 2’ అయిపోయింది.. ఇక ‘దేవర’ మొదలు.. స్టైలిష్ లుక్స్‌లో ఎన్టీఆర్..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో సుహానా ఖాన్ మెయిన్ లీడ్ గా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారట. అంతే కాకుండా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని షారుఖ్ మరో నిర్మాణ సంస్థతో కలిసి తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని సమాచారం.

సుహానా ఖాన్ కి థియేట్రికల్ డెబ్యూట్ గ్రాండ్ గా ఇవ్వాలని, మొదటి సినిమానే హిట్ కొట్టి సుహానాని హీరోయిన్ గా నిలబెట్టాలని షారుఖ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. అయితే దీనిపై ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. కూతుర్ని హీరోయిన్ గా నిలబెట్టడం కోసం 200 కోట్లు అవసరమా, నెపోటిజంని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాని బదులు ట్యాలెంట్ ఉన్న వాళ్ళతో సినిమా చేయొచ్చు కదా, సుహానా ది ఆర్చీస్ సినిమాలో వరస్ట్ గా యాక్టింగ్ చేసింది అని కొంతమంది విమర్శిస్తుంటే, అభిమానులు మాత్రం కూతురు కోసం షారుఖ్ కష్టపడుతున్నాడని అభినందిస్తున్నారు. మొత్తానికి కూతుర్ని హీరోయిన్ గా చేయడానికి షారుఖ్ 200 కోట్లు బడ్జెట్ పెట్టడం బాలీవుడ్ లో చర్చగా మారింది.