Jr NTR : ‘వార్ 2’.. ‘దేవర’.. బ్యాక్ టు బ్యాక్ కష్టపడుతున్న ఎన్టీఆర్..

ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూట్ ఒక షెడ్యూల్ ముగించుకొని మొన్న హైదరాబాద్ కి వచ్చారు. మళ్ళీ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ వార్ 2 షూట్ కోసం ముంబై వెళ్లారు.

Jr NTR : ‘వార్ 2’.. ‘దేవర’.. బ్యాక్ టు బ్యాక్ కష్టపడుతున్న ఎన్టీఆర్..

Jr NTR Completed War 2 Shooting Schedule and ready to start Devara Shoot

Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(Devara), వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా హీరో అవ్వడంతో ఎన్టీఆర్ ఆ రేంజ్ లోనే సినిమా తీసుకురావాలని ‘దేవర’తో సిద్దమవుతున్నాడు. దేవర పార్ట్ 1 సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేవర గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఓ పక్క దేవర చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో యాక్షన్ అదరగొట్టబోతున్నాడు. ఆల్రెడీ గత వారం రోజులు ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ హీరో హృతిక్, మాస్ హీరో ఎన్టీఆర్ కలిసి యాక్షన్ సీన్స్, డ్యాన్స్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Also Read : Raj Tarun : నాకు జీవితంలో పెళ్లి, పిల్లలు వద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న యువ హీరో..

ఇక ఎన్టీఆర్ ముంబైలో వార్ 2 షూట్ ఒక షెడ్యూల్ ముగించుకొని మొన్న హైదరాబాద్ కి వచ్చారు. మళ్ళీ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ వార్ 2 షూట్ కోసం ముంబై వెళ్లారు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో విజువల్స్ వైరల్ అయ్యాయి. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టాడు. దీంతో ఎన్టీఆర్ లుక్స్ వైరల్ గా మారాయి. ఈ షెడ్యూల్ అయ్యాక ఎన్టీఆర్ దేవర షూట్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఎన్టీఆర్ దేవర లాంగ్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ షూట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో దేవర నుంచి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.