HanuMan movie graphics is designed by hyderabad company HaloHues Studios
HanuMan : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ ఇటీవల రిలీజయ్యి ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ ఈ సినిమా గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కథతో పాటు తక్కువ బడ్జెట్ తో సినిమాలో చూపించిన గ్రాఫిక్స్.. ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పించాయి.
ఈ గ్రాఫిక్స్ చూపిస్తూ ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంత గొప్ప గ్రాఫిక్స్ ఇచ్చిన కంపెనీ గురించి మాత్రం పెద్దగా ఎవరు మాట్లాడుకోవడం లేదు. అసలు ఆ కంపెనీ ఎక్కడిది అన్న ప్రశ్న కూడా రావడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో టాప్ కంపెనీస్ లో చేయిస్తున్నారు.
Also read : Manchu Vishnu : ‘కన్నప్ప’ మైథలాజికల్ మూవీ కాదు.. మంచు విష్ణు సీరియస్ వీడియో..
కానీ హనుమాన్ గ్రాఫిక్స్ ని మాత్రం.. మన హైదరాబాద్ లోనే చేయించేశారు. ‘హేలో హ్యూస్ స్టూడియోస్’ అనే విఎఫ్‌ఎక్స్ కంపెనీ హనుమాన్ మూవీలోని గ్రాఫిక్స్ ని హాలీవుడ్ స్టాండర్డ్స్ తో క్రియేట్ చేసి వారేవా అనిపించారు. సినిమా సక్సెస్ లో ఈ గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గ్రాఫిక్ వర్క్ తో ప్రస్తుతం ఈ కంపెనీ పేరు టాలీవుడ్ లో రీసౌండ్ వస్తుంది.
ఇక హనుమాన్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్రెడీ 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. కేవలం ఇండియాలోనే 80 కోట్ల వరకు కలెక్షన్స్ ని నమోదు చేసినట్లు సమాచారం. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా పూర్తీ అయిపోయిన ఈ చిత్రం.. డబల్ బ్లాక్ బస్టర్ ని క్రాస్ చేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది. అటు అమెరికాలో కూడా ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తుంది. మూడు మిలియన్ మార్క్ ని దాటేసిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులు వైపు వెళ్తుంది.