Hanuman : అయోధ్య రామ మందిరం ప్రారంభం.. హాఫ్ రేట్‌కే హనుమాన్ టికెట్స్ ఎక్కడో తెలుసా?

నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హనుమాన్ సినిమా రిలీజ్ చేసిన సంస్థ సగం ధరకే టికెట్లు ఆఫర్ చేస్తుంది.

Hanuman Movie Special Offer on Ticket Price on the Occasion of Ayodhya Ram Mandir Opening

Hanuman : నేడు దేశమంతా ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) నేడు ప్రారంభం కానుంది. దీంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రంగాల నుంచి పలువురు ప్రముఖులు అయోధ్యకు హాజరయ్యారు. దేశమంతా ఎవరికి తోచినట్టు వారు ఈ పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు అన్నదానాలు నిర్వహిస్తున్నారు. పలువురు తమ వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు బిజినెస్ సంస్థలు స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్రయూనిట్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అయి సంక్రాంతికి రిలీజయిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో సూసుకుపోతుంది. ఇక హనుమాన్ సినిమా అమెరికాలో కూడా ఇప్పటికే 4 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు సెట్ చేసింది.

నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలో హనుమాన్ సినిమా రిలీజ్ చేసిన సంస్థ సగం ధరకే టికెట్లు ఆఫర్ చేస్తుంది. అమెరికాలోని పలు ఏరియాలలో దాదాపు 11 థియేటర్స్ లో నేడు హనుమాన్ సినిమాని హాఫ్ రేట్ కే అందిస్తుంది. దీంతో అమెరికాలో ఉండే ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజయి 10 రోజులు అవుతున్నా అమెరికాలో హనుమాన్ సినిమాకి ప్రేక్షకులు బాగానే వస్తున్నారు. ఈ ఆఫర్ తో నేడు థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు.

Also Read : సైలెంట్‌గా సంక్రాంతికి క్లీన్ హిట్ కొట్టేసిన కింగ్.. ‘నా సామిరంగ’ బ్రేక్ ఈవెన్.. హాఫ్ సెంచరీకి దగ్గర్లో..

ఇక్కడ ఇండియాలో మిరాజ్ సినిమాస్ సంస్థ కూడా తమ థియేటర్ల వరకు ఓ ఆఫర్ ని ప్రకటించింది. నేడు ఒక్కరోజు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మిరాజ్ సినిమాస్ లో హనుమాన్ సినిమా చూసేవారికి ఒక టికెట్ కొంటె ఇంకో టికెట్ ఫ్రీ అని, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఆ ఆఫర్ పై ప్రేక్షకులు కూడా సంతోషిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అన్ని థియేటర్స్ లో ఇస్తే బాగుండేది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.