Naa Saami Ranga Collections : సైలెంట్‌గా సంక్రాంతికి క్లీన్ హిట్ కొట్టేసిన కింగ్.. ‘నా సామిరంగ’ బ్రేక్ ఈవెన్.. హాఫ్ సెంచరీకి దగ్గర్లో..

అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక సైలెంట్ గా జనవరి 14న నా సామిరంగ సినిమాని రిలీజ్ చేశారు.

Naa Saami Ranga Collections : సైలెంట్‌గా సంక్రాంతికి క్లీన్ హిట్ కొట్టేసిన కింగ్.. ‘నా సామిరంగ’ బ్రేక్ ఈవెన్.. హాఫ్ సెంచరీకి దగ్గర్లో..

Nagarjuna Naa Saami Ranga Movie Collections Details Clean hit with All Areas Break Even in Eight Days

Updated On : January 22, 2024 / 11:40 AM IST

Naa Saami Ranga Collections : నాగార్జున(Nagarjuna) ఈ సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని నాగ్ వచ్చాడంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. సంక్రాంతికి ఎప్పట్నుంచో ప్రమోట్ చేసుకుంటూ వస్తాయి కొన్ని సినిమాలు. కానీ నాగార్జున సంక్రాంతికి మూడు నెలల ముందు సినిమా అనౌన్స్ చేసి ఎక్కువ ప్రమోషన్స్ లేకుండానే సైలెంట్ గా వచ్చి హిట్ కొడతాడు.

ఈ సారి నా సామిరంగ సినిమాకు అదే జరిగింది. అసలు సంక్రాంతి బరిలో లేని నాగార్జున సడెన్ గా వచ్చి సంక్రాంతికి సినిమా తెస్తానని చెప్పాడు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. పండక్కి పండగ లాంటి సినిమాని తీసుకొచ్చాడు. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక సైలెంట్ గా జనవరి 14న నా సామిరంగ సినిమాని రిలీజ్ చేశారు. థియేటర్స్ ఇష్యూ ఉన్నా పట్టించుకోలేదు, టికెట్ రేట్లు పెంచలేదు. అయినా హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ సాధించి కలెక్షన్స్ తెచ్చేసి నా సామిరంగ అనిపించాడు నాగార్జున.

Also Read : Ayodhya Ram Mandir : అయోధ్యలో సినీ సెలబ్రిటీలు.. చిరు, పవన్, రజిని, అమితాబ్, చరణ్.. రామయ్య సేవలో..

నా సామిరంగ సినిమా 18 కోట్లకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ సాధించిన నా సామిరంగ ఎనిమిదిరోజులకు ఏకంగా 44.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే దాదాపు 22 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లో నడుస్తుంది నా సామిరంగ. 50 కోట్లకు కూడా చేరుకొని హాఫ్ సెంచరీ గ్రాస్ కొట్టేస్తుంది. ఓ పక్కన స్టార్ హీరో గుంటూరు కారం ఊపు, మరో పక్క హనుమాన్ సినిమా హడావిడి రెండిటిని తట్టుకొని నిలబడి నా సామిరంగ అని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందంటే నిజంగా సంక్రాంతి సినిమా పండగే. ఇక నాగార్జున వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సీక్వెల్ తో వస్తాడని టాక్ కూడా నడుస్తుంది.