Teja Sajja : 28 ఏళ్ళ వయసు.. 25 ఏళ్ళు అనుభవం.. తేజ సజ్జ ఎమోషనల్ పోస్ట్!

మూడు ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. వయసులో 28ని కెరీర్ లో 25ని పూర్తి చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా..

Hanuman star Teja Sajja emotional post on his completion of 25 years career

Teja Sajja : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ మూడు ఏళ్ళ వయసులోనే సినిమా కెరీర్ స్టార్ట్ చేసేశాడు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక ఇటీవలే హీరోగా పరిచయం అయ్యి వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో తన 28వ పుట్టినరోజుని ఆగష్టు 23న జరుపుకున్నాడు. అలాగే నేటితో (ఆగష్టు 27) ఇండస్ట్రీకి పరిచయమయ్యి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానికి అదిరే రిప్లై ఇచ్చిన నిర్మాత.. బర్త్ డేకి టాలీవుడ్..!

దీంతో తన సోషల్ మీడియాలో తన డెబ్యూట్ సందర్భంలోని ఫోటోలను షేర్ చేసి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. అశ్వినీ దత్ నిర్మాణంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ‘చూడాలని ఉంది’ సినిమాతో తేజ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి తేజ వయసు కేవలం మూడేళ్లు మాత్రమే. ఆ సినిమా ఫంక్షన్ టైంలో చిరంజీవి తనని ఎత్తుకొని అభిమానులను చూపిస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. “25 ఏళ్ళ క్రితం నేను ఎలాంటి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అనేది నాకు ఏ మాత్రం తెలియదు. కానీ అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక లెజెండ్ పక్కన కనిపిస్తూ పరిచయమైన నేను ‘హనుమాన్’ వరకు చేరుకున్నా. ఇదంతా ఒక కలలా ఉంది. చిరంజీవి గారు, గుణశేఖర్ గారు, అశ్వినీ దత్ గారు మీరే ఆ కలని నిజం చేశారు. దీనికి ఎప్పటికి రుణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చాడు.

Samantha – Vennela Kishore : సమంత నిర్మాణంలో వెన్నల కిశోర్ మెయిన్ లీడ్‌తో మూవీ..!

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ తేజకి అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా తేజ ప్రస్తుతం హనుమాన్ (HanuMan) సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సూపర్ హీరో చిత్రంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. టీజర్ తో ఈ మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.