హ్యాపీ బర్త్‌డే చియాన్ విక్రమ్

విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా కడరమ్ కొండన్ మేకింగ్ వీడియో రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 17, 2019 / 09:53 AM IST
హ్యాపీ బర్త్‌డే చియాన్ విక్రమ్

Updated On : April 17, 2019 / 9:53 AM IST

విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా కడరమ్ కొండన్ మేకింగ్ వీడియో రిలీజ్..

సినిమా సినిమాకి ఢిఫరెన్స్ చూపిస్తూ, చేసే ప్రతీ క్యారెక్టర్‌లోనూ వేరియేషన్ చూపిస్తూ, నటుడిగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చియాన్ విక్రమ్.. ఈరోజు విక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విక్రమ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్, కడరమ్ కొండన్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసిందీ మూవీ యూనిట్. ఈసినిమాని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. రాజేష్ ఎం సెల్వ డైరెక్ట్ చేస్తున్నాడు. విక్రమ్ న్యూ లుక్ చాలా బాగుంది. తను ఈ సినిమాలో కెకె అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎక్కువ శాతం మలేషియాలో షూటింగ్ జరిపారు. అక్షర హాసన్, పూజా కుమార్ తదితరులు నటిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రాజ్ కమల్ బ్యానర్‌లో రూపొందుతున్న 45 వ సినిమా కడరమ్ కొండన్‌ని తమిళ్ పాటు తెలుగులోనూ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

వాచ్ మేకింగ్ వీడియో..