Chiranjeevi : హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

ప్రేక్షకుడి గుండెల్లో ఆత్మీయ ఖైదీగా మిగిలిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. మెగాస్టార్ 66వ వడిలోకి అడుగు పెట్టారు.

Chiru

Megastar : తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో ఆత్మీయ ఖైదీగా మిగిలిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 2021, ఆగస్టు 22వ తేదీ ఆదివారంతో మెగాస్టార్ 66వ వడిలోకి అడుగు పెట్టారు. కెరీర్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలో సామాన్య నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి తనకు తానుగా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు చిరంజీవి.

Read More : Sravana Masam : శ్రీశైలంలో శ్రావణమాస పౌర్ణమి పూజలు

అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందించారు. మెగా హీరోలకే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్‌ అయ్యారు. అగ్ర కథానాయకుడిగా బాక్సాఫీస్‌ను శాసించిన చిరంజీవి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలెన్నో. అయితే ప్రతి పాఠాన్ని విజయంగా మార్చుకుంటూ తనకు తానుగా మెగా హిట్స్‌తో ఎవరూ అందుకోలేని రేంజ్‌కు చేరుకున్నారు.

Read More : Kalyan Singh : మాజీ సీఎం కన్నుమూత

వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు చిరంజీవి. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారినా.. పనిలో తన ఫోకస్‌ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చిరంజీవి. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా కూడా.. ఆయన గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ చిరంజీవి మంచి స్పీడుమీదున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డి వంటి హిస్టారిక‌ల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో సంద‌డి చేసిన చిరంజీవి ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు.

Read More :Kissing : నడిరోడ్డుపై బలవంతంగా ముద్దు.. స్వాతంత్ర దినం రోజునే మరో దారుణం

అలాగే మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్‌లోనూ న‌టిస్తున్నారు. అలాగే మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు చిరంజీవి. ఇక యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఇక తన పుట్టిన రోజు నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. పర్యావరణాన్ని కాపాడుకుంటామని మనందరం ప్రకృతి మాతకు మాటివ్వాలని పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా మూడు మొక్కలు నాటాలని అభిమానులందరినీ కోరారు. ఇక చిరు బర్త్ డేను పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటాలని మెగాస్టార్ అభిమానులకు పిలుపునిచ్చారు.