Kissing : నడిరోడ్డుపై బలవంతంగా ముద్దు.. స్వాతంత్ర దినం రోజునే మరో దారుణం

ఒకడు బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు, మరొకడు తాకరాని చోట తాకుతాడు. ఇంకొకడు బట్టలు చింపుతాడు. ఇలా శాడిస్టుల్లా తయారయ్యారు. వికృతానందం పొందుతున్నారు.

Kissing : నడిరోడ్డుపై బలవంతంగా ముద్దు.. స్వాతంత్ర దినం రోజునే మరో దారుణం

Kissing

Kissing : మత చాందసవాదంతో అట్టుడికే పాకిస్తాన్ లో మహిళలకు భద్రత కరువైంది. స్వేచ్చగా, సమానత్వంతో మహిళలు బతికే రోజులు పోయాయి. స్త్రీలపై అకృత్యాలు పెరిగాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మృగాడు వచ్చి దాడి చేస్తాడో తెలియని దుస్థితి. ఒకడు బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు, మరొకడు తాకరాని చోట తాకుతాడు. ఇంకొకడు బట్టలు చింపుతాడు. ఇలా శాడిస్టుల్లా తయారయ్యారు. వికృతానందం పొందుతున్నారు. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

పాకిస్థాన్‌ స్వాతంత్ర దినోత్సవం రోజున (ఆగస్టు 14) టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటున్న యువతిపై వందలాది మంది దాడికి పాల్పడి, బట్టలు చింపి గాల్లోకి ఎగరేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే రోజున మరో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పాకిస్థాన్‌లో మహిళలపై దాడులు పెరిగాయనేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

రద్దీగా ఉండే రహదారిపై ఓపెన్ రిక్షాలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తుండగా.. ఓ వాహనంపై వెళ్తున్న యువకుడు అమాంతం రిక్షాలోకి ఎక్కి ఓ యువతిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఇద్దరు మహిళల మధ్యలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళలు ఇద్దరూ బిత్తరపోయారు. బాధితురాలు పెద్దగా కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి ముందు మహిళలు వెళ్తున్న రిక్షాను కొందరు యువకులు బైక్‌‌తో వెంబడించి, టీజ్ చేశారు. కామెంట్స్ చేస్తూ వెంటబడటంతో బాధితులు ఆందోళన చెందారు.

పాక్ జాతీయ జెండాను ఎగురవేస్తూ కార్లు, బైక్‌లు ఆ రిక్షాను చుట్టుముట్టి ఉండటాన్ని బట్టి లాహోర్‌లో పాక్ స్వాతంత్ర దినోత్సవం రోజునే జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మరో దారుణం కూడా జరిగింది. మహిళా టిక్ టాకర్ పై మూక దాడి జరిగింది. ఓ టిక్ టాకర్ తన స్నేహితులతో కలిసి లాహోర్ లోని మినార్-ఇ-పాకిస్తాన్ దగ్గర వీడియోలు తీసుకుంటూ ఉండగా, సుమారు 300 నుంచి 400 మంది మగవాళ్లు ఆమెను చుట్టుముట్టారు. అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులు చించేశారు. గాల్లోకి ఎగరేశారు. అంతేకాదు ఉంగరం, చెవి రింగులు, మొబైల్ ఫోన్, రూ.15వేలు కూడా లాక్కున్నారు. ఈ ఘటనపై సదురు టిక్ టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.