Puneeth Rajkumar : పవర్‌స్టార్ అరిపించేశాడంతే.. ‘యువరత్న’ గా పునీత్ రాజ్‌కుమార్..

పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ హీరోగా, సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్).. రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది.

Puneeth Rajkumar : పవర్‌స్టార్ అరిపించేశాడంతే.. ‘యువరత్న’ గా పునీత్ రాజ్‌కుమార్..

Happy Birthday Powerstar Puneeth Rajkumar1

Updated On : March 17, 2021 / 1:23 PM IST

Puneeth Rajkumar: ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ హీరోగా, సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్).. రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది.

Yuvarathnaa

తెలుగులోనూ ‘యువరత్న’ పేరుతో విడుదల చెయ్యనున్నారు. బుధవారం (మార్చి 17) పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ఫీల్ ది పవర్’ అనే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాశారు. రేవంత్ చక్కగా పాడారు.

Yuvarathnaa

ఇక పవర్‌స్టార్ విషయానికొస్తే.. పునీత్ డ్యాన్సింగ్ స్టైల్ గురించి తను వేసే ఎనర్జిటిక్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. అభిమానుల మాటగా చెప్పాలంటే.. చితక్కొట్టేశారు.. గెడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తూనే స్టైలిష్ స్టెప్స్ వేశారు. త్వరలో ‘యువరత్న’ కన్నడ, తెలుగులో భారీగా విడుదల కానుంది.