Site icon 10TV Telugu

Hari Hara Veera Mallu: డీజే డ్యాన్సులు, అంబరాన్నంటిన సంబరాలు.. థియేటర్ల దగ్గర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాస్ జాతర..

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు హంగామా మొదలైపోయింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ప్రీమియర్ షో స్టార్ట్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 24వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ కానుండగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్ షో పడింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ధూమ్ ధామ్ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.

పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడం, రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటం.. హరిహర వీరమల్లుకు మరింత క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. జ్యోతి క్రిష్ణ డైరెక్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ కొంత భాగం డైరెక్ట్ చేశారు. డేట్స్ కుదరకపోవడంతో డైరెక్టర్ మారారు.

ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమ అభిమాన నటుడు ఓ వీరోచిత పాత్రలో కనిపిస్తుండటం పవన్ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచింది. దాదాపు ఐదేళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూసిన సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు పడ్డాయి.

Exit mobile version