Hari Hara Veera Mallu Trailer in 24 hours with 48+ million views
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా గురువారం ట్రైలర్ ను విడుదల చేసింది.
కాగా.. ఈ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదండోయ్.. ఈ చిత్రం అన్ని భాషల్లో 24 గంటల్లో 61.7 మిలియన్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది జస్ట్ రికార్డు మాత్రమే కాదు.. తదుపరి కొల్లగొట్టబోయే వాటికి ఇది వార్నింగ్ అంటూ రాసుకొచ్చింది.
3BHK Twitter Review : సిద్దార్థ్ 3BHK ట్విటర్ రివ్యూ..
Yesterday the director said – Ee Saari Date maaradhu – Industry Record lu maaruthayi .
And you know exactly what just happened 😉
Powerstar @PawanKalyan’s #HHVMTrailer is now the 𝗠𝗢𝗦𝗧 𝗩𝗜𝗘𝗪𝗘𝗗 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗧𝗥𝗔𝗜𝗟𝗘𝗥 𝗜𝗡 𝟮𝟰 𝗛𝗢𝗨𝗥𝗦 with 𝟰𝟴+ 𝗠𝗜𝗟𝗟𝗜𝗢𝗡… pic.twitter.com/asu7njfF4G
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 4, 2025
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెరకెక్కించారు. అయితే.. కొన్నికారణాల వల్ల ఆయన తప్పుకోగా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించారు.