Harish Shankar : రీట్వీట్లు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భజన చేస్తున్నావా అని విమర్శిస్తున్నారు..

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అక్షరం విలువ తెలిసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఏం ట్వీట్ చేసినా, కేటీఆర్ గారు చేసిన ట్వీట్స్ ఏమన్నా రీ ట్వీట్ చేసినా నన్ను నెగిటివ్...........

Harish Shankar :  సంతోషం, సంబరం.. లాంటి పలు సినిమాల డైరెక్టర్, రచయిత దశరథ్ చివరగా 2016 లో మంచు మనోజ్ తో శౌర్య అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన దగ్గర్నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కొన్ని సినిమాలకి మాత్రం రచయితగా సహకారం అందిస్తున్నట్టు సమాచారం. తాజాగా సినిమా స్టోరీ రైటింగ్ కు సంబంధించి దర్శకుడు దశరథ్ రాసిన ‘కథా రచన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

ఈ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ భాష సాంసృతిక శాఖ తరపున ప్రచురించింది. దీంతో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి KTR విచ్చేశారు. దశరథ్ రాసిన కథా రచన అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో KTR తో పాటు దర్శకులు వివి వినాయక్, నాగ అశ్విన్, హరీష్ శంకర్, కాశీ విశ్వనాథ్, వి ఎన్ ఆదిత్య.. మరి కొంతమంది ప్రముఖులు హాజరు అయ్యారు.

Gopichand Malineni : బాలకృష్ణ అభిమానుల మీద లాఠీ ఛార్జ్.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ గోపీచంద్

ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అక్షరం విలువ తెలిసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఏం ట్వీట్ చేసినా, కేటీఆర్ గారు చేసిన ట్వీట్స్ ఏమన్నా రీ ట్వీట్ చేసినా నన్ను నెగిటివ్ చేస్తున్నారు. రీట్వీట్లు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భజన చేస్తున్నావా అని విమర్శిస్తున్నారు. కుక్కలు మొరిగినంత మాత్రాన నేను భయపడను. పుస్తకాలు అన్నా, సాహిత్యం అన్నా ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ పుస్తకం వస్తుంది. దశరథ్ రాసిన ఈ పుస్తకం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు